Published : 29 Jan 2023 00:39 IST

Weekly Horoscope: రాశిఫలం (జనవరి 29 - ఫిబ్రవరి 4)


ఉద్యోగంలో అద్భుతవిజయం ఉంది. గుర్తింపు లభిస్తుంది. బద్ధకించకుండా ఎప్పటి పని అప్పుడు చేయాలి. ధనయోగం ఉంది, కోరుకున్న జీవితం లభిస్తుంది. ఇతరులపై ఆధారపడవద్దు. స్వయంగా చేసే పనుల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. నూతన వస్తులాభం సూచితం. ఆనందించే అంశాలు ఉంటాయి. బంధాలు బలపడతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్ఠం.


ముఖ్యకార్యాలను జాగ్రత్తగా పూర్తిచేయాలి. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. శాంతంగా సమాధానమివ్వాలి. ఉపద్రవాలనుంచి బయటపడతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. స్వయంకృషితో అద్భుతాలు సృష్టించగలరు. నవగ్రహ శ్లోకాలు చదవండి, శాంతియుత జీవనం లభిస్తుంది.


సంపదలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంది. ధైర్యంగా ఉండాలి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువ అవుతుంది. పనిని సకాలంలో పూర్తిచేయండి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సూచనలు అవసరం. వ్యాపారంలో కలిసివస్తుంది. విష్ణుస్మరణ మేలుచేస్తుంది.


మంచి కాలం. ఇప్పుడు చేసే పనులు అద్భుతమైన విజయాన్నిస్తాయి. లక్ష్యసాధనే ఆశయంగా కృషిచేయాలి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. మనోభీష్టం సిద్ధిస్తుంది. గృహవాహనాది యోగాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు. శత్రువులు మిత్రులవుతారు. స్థిరత్వం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.


ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధించండి. ఆవేశం పనికిరాదు. అధికారుల అండ ఉంటుంది. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదవండి, శుభవార్త వింటారు.


వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనల్లో పరిణతి వస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా బాధ్యతల్ని నిర్వర్తించండి. అనుకున్న ఫలితం వస్తుంది. ఆధ్యాత్మికసాధన ప్రశాంతతనిస్తుంది. సూర్య, సుబ్రహ్మణ్యశ్లోకాలు చదువుకుంటే ఆపదలు తొలగుతాయి.


సకాలంలో పని ప్రారంభించండి. ముఖ్యమైన కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపడవద్దు. సౌమ్యంగా మాట్లాడాలి. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించవద్దు. ధనయోగం అనుకూలం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో విఘ్నం రానివ్వవద్దు. సమష్టి కృషి శక్తినిస్తుంది. ధర్మబద్ధంగా ముందుకెళ్లాలి. నవగ్రహశ్లోకాలు చదివితే శాంతి లభిస్తుంది.


శుభకాలం నడుస్తోంది. పనులను సకాలంలో పూర్తిచేస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అధికారుల ప్రశంసలుంటాయి. మంచి పనులు చేసి పేరు తెచ్చుకునేందుకు అనుకూలమైన కాలం. అదృష్టవంతులవుతారు. వ్యాపారంలో కలసివస్తుంది. పలుమార్గాల్లో అభివృద్ధి ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి, వెతుకుతున్నది దొరుకుతుంది.


సకాలంలో పని మొదలుపెడితే మంచి విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం అవసరం. ఒత్తిడి లేకుండా వ్యవహరించండి, అనుకున్నది లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు వల్ల నష్టం వస్తుంది. ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషించాలి. సమష్టి కృషి పనిచేస్తుంది. స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలి. ధర్మం గెలిపిస్తుంది. సూర్యనమస్కారం మంచిది.


అవసరాలకు ధనం లభిస్తుంది. చేపట్టే పనుల్లో ఏకాగ్రతను పెంచండి. ఆందోళన కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. గతానుభవంతో నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. చంచలత్వం పనికిరాదు. మిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నమ్మకం గెలిపిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి, వివాదాలు దరిచేరవు.


అద్భుతమైన విజయాలనిచ్చే మంచి సమయమిది. అభీష్టాలు నెరవేరతాయి. వ్యాపారంలో అనుకున్న లాభాలుంటాయి. ధనధాన్యవృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పైవారి నుంచి ఒత్తిడి ఉండవచ్చు. సకాలంలో పని పూర్తిచేయాలి. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది కనుక ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. సూర్యధ్యానం మంచిది.


ఉద్యోగం బాగుంటుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చంచలత్వం వల్ల సమస్యలొస్తాయి. ముందూ వెనకా బాగా ఆలోచించి, బంధుమిత్రులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో ఇబ్బంది సూచితం. సంకల్పబలం ముఖ్యం. నవగ్రహధ్యాన శ్లోకాలు చదివితే మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..