Weekly Horoscope: రాశిఫలం (జూన్‌ 16 - 22)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 16 Jun 2024 06:53 IST


ఉత్తమ కాలం. మంచి పనులు చేస్తారు. ఆలోచనల్లో పరిపక్వత సాధిస్తారు. రేపటికి పునాదులు వేసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వారం ఆరంభంలో శుభవార్త వింటారు. గురుగ్రహం కీర్తిప్రతిష్ఠల్ని తెచ్చిపెడుతుంది. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.


వ్యాపారం లాభదాయకం. ముఖ్యమైన విషయాల్ని ఆత్మీయులతో కలిసి సమీక్షించండి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. లక్ష్య సాధనలో వెనకడుగు వద్దు. ఏకాగ్రతకు అవరోధాలు సృష్టించేవారున్నారు జాగ్రత్త. ఏదీ లోతుగా ఆలోచించొద్దు. ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక దృఢత్వం పెంచుకోండి. సూర్యుడిని ధ్యానించండి. సూర్యధ్యాన శ్లోకం కోసం క్లిక్‌ చేయండి


ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తిచేయాలి. నకారాత్మక ఆలోచనలు వద్దు. భయాలను వదిలిపెట్టండి. ఏకాగ్రతతో శుభ ఫలితాలు అందుకుంటారు. కొన్ని చికాకులు ఉంటాయి. సహనంతో వ్యవహరించండి. అనవసర సంభాషణలు వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. మిత్రుల సలహాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


దైవబలం ముందుకు నడిపిస్తుంది. మీదైన రంగంలో లాభాలు సంపాదిస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. జాగ్రత్తగా అడుగేస్తూ ఆ అవరోధాలను అధిగమించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరించండి. అంతిమ విజయం మీదే. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి. సూర్యధ్యానం శుభప్రదం. సూర్యధ్యాన శ్లోకం కోసం క్లిక్‌ చేయండి


శుభ యోగాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పదవీయోగం ఉంది. నలుగురి ప్రశంసలూ లభిస్తాయి. సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. గ్రహబలం అనుకూలం. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. అధికార యోగం సూచితం. ప్రశంసలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ పెరిగినా, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. గతంతో పోలిస్తే మంచి రోజులు రానున్నాయి. శివారాధన మేలు చేస్తుంది.


లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పొదుపు-మదుపు అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఒక ఆపద నుంచి బయటపడతారు. పనులు వాయిదా వేయకండి.  కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచుతారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ధర్మబద్ధ మైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు మంచి చేస్తారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. వ్యాపారంలో విఘ్నాలు గోచరిస్తున్నాయి. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


మిశ్రమకాలం నడుస్తోంది. ముఖ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మలుచుకోవాలి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. సమయస్ఫూర్తి అవసరం. ఇతరులపై ఆధారపడవద్దు. మోసగాళ్లతో జాగ్రత్త. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి.


ఉద్యోగులకు జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కాకపోతే, పారదర్శకత ముఖ్యం. మిత్రుల సహకారం అందుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శ్రీరామ నామాన్ని స్మరించండి.


సంకల్పం సిద్ధిస్తుంది. విజయం వరిస్తుంది. తాత్కాలిక అవరోధాలకు నిరాశ వద్దు. అంతిమంగా మీదే పైచేయి అవుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి మొహమాటానికి పోయి అప్పులు ఇవ్వకండి. చంచలత్వం మంచిది కాదు. స్థిరంగా అడుగేయండి. విష్ణుమూర్తిని ధ్యానించండి.


మనోబలం ముందుకు నడిపిస్తుంది.  బుద్ధిబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉద్యోగ జీవితంలో స్వల్ప ఒడుదొడుకులు ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఓ వివాదంలోంచి కడిగిన ముత్యంలా బయటపడతారు. ఆత్మీయులతో విభేదాలు వద్దు. వారం ప్రారంభంలో శుభాలు జరుగుతాయి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..