Weekly Horoscope: గ్రహబలం (జూన్‌ 23 - 29)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 23 Jun 2024 07:17 IST


మంచి కాలం నడుస్తోంది. శుభ ఫలితాలు లభిస్తాయి. విజయాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులు కొలిక్కి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. దీర్ఘకాలిక అన్వేషణలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీర్తి పెరుగుతుంది. చంచలమైన నిర్ణయాలు వద్దు. వివాదాలకు అతీతంగా ఉండండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


వ్యాపార ఫలితాలు లాభదాయకం. బుద్ధిబలంతో పరిస్థితుల్ని దారికి తెచ్చుకుంటారు. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. భూ, గృహ యోగాలున్నాయి. సంపద వృద్ధికి ఇదే సరైన సమయం. రుణాల జోలికి వెళ్లొద్దు. మొహమాటంతో పూచీకత్తులు ఇవ్వొద్దు. ఓ శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


మనోధైర్యంతో పనులు మొదలుపెట్టండి. ఉత్తమ ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. తెలియని రంగాలలో అడుగుపెట్టడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో శ్రమ అధికం అవుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో పొరపాట్లను పరిహరించండి. విష్ణుమూర్తిని ధ్యానించాలి.


మనోబలంతో ముందుకెళ్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. విజయాలు వరిస్తాయి. అవరోధాలు దూరం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పనుల వాయిదా వద్దు. ఆత్మీయులతో అపోహలు తొలగుతాయి. నమ్మకానికి విలువ ఇవ్వండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.  నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయస్ఫూర్తి అవసరం. శుక్రుడి వల్ల ధనలాభం ఉంది. మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొందరి కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. సమయోచిత స్పందన అవసరం. మహావిష్ణువును ఉపాసించండి.


ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో తక్షణ స్పందన అవసరం. మీ కృషిని నలుగురూ గుర్తిస్తారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. దైవబలం రక్షిస్తుంది. ఆర్థిక అవరోధాలు ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ బుద్ధిబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. విజయాలు ఎదురుచూస్తున్నాయి. పొదుపు-మదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వద్దు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. మీ ఆలోచనలకు రూపం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యుల సూచనలు మంచి చేస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.  నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


దైవబలం కాపాడుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. నిజాయతీగా వాటిని అమలు చేయండి.  ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆటంకాలు తొలగుతాయి. ఏ విషయంలోనూ చంచలత్వం వద్దు. మనసును అదుపులో ఉంచుకోండి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.


సకాలంలో పనులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం మిశ్రమకాలం నడుస్తోంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదలకు కార్యాచరణ ప్రణాళిక అవసరం. వాయిదా మనస్తత్వం మంచిది కాదు. ఒత్తిడిని అధిగమించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. వ్యాపారులకు ఇది మిశ్రమకాలం. కులదేవతను పూజించండి.


శుభప్రదమైన సమయం. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. భవిష్యత్తు ఆశాజనకం. ఉత్తమ ప్రతిభను కనబరుస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ధనలాభం ఉంది. వ్యయాలు సూచితం. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సంపాదన పెంచుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించండి.


మనోబలం ముందుకు నడిపిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు కొత్తశక్తినిస్తాయి. ఏల్నాటి శని దోషం ఉంది. అనాలోచిత నిర్ణయాలు వద్దు. దుందుడుకు చర్యలకు సమయం కాదు. లక్ష్యం మరింత చేరువ అవుతుంది. వారాంతంలో అదృష్టం వరిస్తుంది. ఆత్మీయులతో విభేదాలు శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో శ్రమ అధికం. సూర్యనారాయణుడిని ఉపాసించండి.


మనోబలంతో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ధనయోగం ఉంది. బుద్ధిబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. నిర్ణయాల్లో అస్పష్టత వద్దు. ఉద్యోగులకు ఆత్మ విశ్వాసం అవసరం. నలుగురినీ కలుపుకుని వెళ్లండి. అభిప్రాయ భేదాలు తొలగించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు