Weekly Horoscope: రాశిఫలం  

శుక్ర అనుగ్రహంతో ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో పట్టుదలగా పనిచేయండి. ఓర్పు చాలా అవసరం. సాంకేతిక లోపాలు తలెత్త కుండా చూడండి.

Updated : 04 Jun 2023 07:08 IST

గ్రహబలం (జూన్‌ 4 - 10)


శుక్ర అనుగ్రహంతో ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో పట్టుదలగా పనిచేయండి. ఓర్పు చాలా అవసరం. సాంకేతిక లోపాలు తలెత్త కుండా చూడండి. వ్యాపారంలో మేలు జరుగు తుంది. జరగబోయే అనర్థాలను ముందుగానే గ్రహించి కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు. గ్రహదోషాలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. విష్ణుసహస్రనామం శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో విజయావకాశాలు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తిచేయండి. సందేహించ కుండా నిర్ణయాలు తీసుకోండి. తగిన గుర్తింపూ ప్రోత్సాహమూ లభిస్తాయి. నిరాశ చెందవద్దు. తగిన కార్యాచరణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించండి, అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.


శుభయోగాలున్నాయి. ప్రతిపనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో కలిసివస్తుంది. మంచి ఫలితాలను సాధించడానికి అనుకూల సమయం. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. సహకారం అందుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భూ గృహ వాహన సౌఖ్యాలుంటాయి. లక్ష్మీదేవిని స్మరించండి, ఆనందం సిద్ధిస్తుంది.


ఉద్యోగంలో ఆశించిన స్థాయికి ఎదుగుతారు. స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. ఐశ్వర్యవంతులవుతారు. పనులు వాయిదా వేయవద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వ్యాపారంలో కలిసివస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. పట్టువిడుపులు అవసరం. దుర్గామాతను స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.


తలచిన కార్యాలు పూర్తవుతాయి. సకాలంలో పని మొదలుపెట్టండి. గతానుభవంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. పనుల్ని వాయిదా వేయవద్దు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. ఉపద్రవాలనుంచి బయట పడతారు. ఇతరులపై ఆధారపడవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ధ్యానిస్తే మంచిది.


శుభయోగాలున్నాయి.అభీష్టసిద్ధి కలుగు తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. దేనికీ సంకోచించవద్దు. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసు కుంటారు. సమర్థతతో గుర్తింపు సాధిస్తారు. భూలాభం సూచితం. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, శుభవార్త వింటారు.


ముఖ్యకార్యాల్లో ఏకాగ్రత అవసరం. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. తొందరపాటు చర్యల వల్ల సమస్య జటిలమవుతుంది. ఎంత ఓర్పు వహిస్తే అంత మంచి ఫలితాలు పొందవచ్చు. కొందరు ఈర్ష్యతో ఇబ్బందిపెట్టాలని చూస్తారు. ఏదీ మనసుకు తీసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.


వ్యాపారయోగం శుభప్రదం. అధిక ధనలాభాలున్నాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. తగిన తోడ్పాటు అందుతుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. చెడు ఆలోచించవద్దు. ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు.


ఆశించిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. గౌరవప్రతిష్ఠలు లభిస్తాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకుని అమలుచేయండి. స్థిర బుద్ధితో వ్యాపారం చేయాలి. కుజగ్రహాన్ని స్మరించండి, అదృష్టవంతులవుతారు.


ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగముంది. పరిస్థితులకు తగినట్లుగా ముందుకు వెళ్లాలి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారుంటారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. ఇంట్లోవారికి చెప్పి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సమస్యలు రానివ్వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. సూర్యనారాయణ మూర్తిని ధ్యానిస్తే మంచిది.


ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకెళ్తే సత్ఫలితాలుంటాయి. కాలం మిశ్రమంగా ఉంది. దేనికీ తొందర పనికిరాదు. పనులు వాయిదా వేయవద్దు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆత్మీయులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యసిద్ధి లభిస్తుంది. అపార్థాలకు తావివ్వవద్దు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడాలి. విష్ణుసహస్ర నామం చదువుకోండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో అధికారలాభం సూచితం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించండి. చెడు ఊహించవద్దు. వ్యాపారంలో విశేషమైన శుభాలున్నాయి. పలుమార్గాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అదృష్టయోగం కొనసాగుతోంది. భూ గృహ వాహనయోగాలు కలిసివస్తాయి. వేంకటేశ్వర స్వామిని స్మరిస్తే మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు