Updated : 08 May 2022 05:49 IST

Weekly Horoscope: రాశిఫలం ( మే 8 - 14 )


మంచి ఆలోచనలు వస్తాయి. ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సమస్యలు తొలగుతాయి. చంచలత్వం ఇబ్బంది పెడుతుంది. స్పష్టమైన నిర్ణయాలతో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారబలం అద్భుతంగా ఉంది. అధిక లాభాలుంటాయి. ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరు. ఇష్టదేవతాస్మరణ మంచిది.


శ్రేష్ఠమైన కాలమిది. విశేషమైన గౌరవం లభిస్తుంది. అదృష్టఫలాలు అందుతాయి. ఉద్యోగంలో బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. ధనలాభం ఉంది. వ్యాపారంలో పట్టు సాధిస్తారు. ఇష్టదేవతా సందర్శనం శుభాన్నిస్తుంది.


ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ప్రశంసలుంటాయి. కుటుంబ సభ్యుల సూచనలతో నిర్ణయాలు తీసుకోండి. అధికార యోగముంది. వ్యాపారంలో మిశ్రమ వాతావరణం. సమయానుకూలంగా, జాగ్రత్తగా అడుగు వేయాలి. తొందరవద్దు. ఆలోచించి ఖర్చుచేయండి. కొన్ని వివాదాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. దుర్గామాతను స్మరిస్తే మేలు.


కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. అదృష్ట యోగముంది. ఉద్యోగంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో అద్భుతమైన విజయం లభిస్తుంది. ఎటుచూసినా మంచే గోచరిస్తోంది. సద్గోష్ఠి ఉంటుంది. జీవితంలో పైకి వచ్చేందుకు అనుకూలమైన కాలం ఇది. ఇష్టదైవాన్ని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది.


మనసు పెట్టి పనిచేయాలి. చిన్న పొరపాటు కూడా జరగనీయవద్దు. అనేక ఇబ్బందులున్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అసహనం పనికిరాదు. వ్యాపారంలో జాగ్రత్త. ఆవేశపరిచే సన్నివేశాలున్నాయి. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మొహమాటంతో ఖర్చు పెరుగుతుంది. వృథా ప్రయాణాలుంటాయి. సూర్యస్తుతి మేలు.


అదృష్ట యోగముంది. ఎంత కష్టపడితే అంత లాభం. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ధర్మమార్గంలో స్థిరమైన ఫలితాలను సాధిస్తారు. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం చదవండి, మనోబలం లభిస్తుంది.


ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ విఘ్నాలను అధిగమించాలి. మిత్రుల సూచనలు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా శ్రమ పెరుగుతుంది. కాలం వ్యతిరేకంగా ఉన్నా నిరాశ చెందవద్దు. వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. క్రమంగా మంచి అవకాశాలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభం జరుగుతుంది.


ఉద్యోగం అనుకూలం. దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. పనులు త్వరగా పూర్తవుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. గృహ వాహన యోగాలున్నాయి. వ్యాపార అధికార లాభాలున్నాయి. సామర్థ్యం పెరుగుతుంది. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఇష్టదైవాన్ని సందర్శించండి, లక్ష్యం సిద్ధిస్తుంది.


ఉద్యోగరీత్యా శుభకాలం. అనుకున్నది త్వరగా సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో విశేష ధన లాభముంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధన ధాన్య లాభాలుంటాయి. విశేష కార్యసిద్ధి. ఒక పనిలో ఇబ్బందులు తొలగుతాయి. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి, శాంతి లభిస్తుంది.


మనోబలం కార్యసిద్ధినిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా బాధ్యతలను పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక సమస్య జటిలమవుతుంది. ఆర్థికాంశాలు అనుకూలం. వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమష్టిగా చేసే పనుల్లో లాభముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు.


అదృష్ట యోగముంది. కాలం సహకరిస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార లాభం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పట్టుదలతో పనిచేసి బంగారు భవిష్యత్తును సాధిస్తారు. ఇష్టదైవదర్శనం ఆనందాన్నిస్తుంది.


అభీష్టసిద్ధి ఉంది. అవసరాలకు ధనం లభిస్తుంది. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి, ఒత్తిడి తగ్గుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. అపార్థాలకు అవకాశముంది. వారాంతంలో మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. నవగ్రహ స్తోత్రపఠనం శుభప్రదం.


 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని