Published : 19 Nov 2022 23:17 IST

weekly horoscope: గ్రహబలం (నవంబరు 20 - 26)


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మొహమాటం వల్ల సమస్యలొస్తాయి. కాలం వృథా చేయవద్దు. కొన్ని విషయాల్లో గందరగోళస్థితి ఉంటుంది. కుటుంబసభ్యుల సూచనలు పాటించండి. తెలియని ఖర్చు ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల అండ అవసరం. మంచి ఆలోచనలు చేయండి. నవగ్రహాలను దర్శిస్తే మంచిది.


గురుబలం రక్షిస్తోంది. ఉద్యోగంలో శుభఫలితముంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. అధికారలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబపరంగా బలం లభిస్తుంది. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. నిర్ణయాలు తరచూ మార్చవద్దు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో అనుకున్న ఫలితం వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొరపాటు జరగనివ్వద్దు. ధనయోగం సూచితం. ప్రశంసలుంటాయి. సమయానుకూలంగా ముందుకుసాగండి. విజయానికి చేరువవుతారు. కొన్ని నిర్ణయాలు మీ ప్రతిష్ఠను పెంచుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. దుర్గాదేవి దర్శనంతో ఆపద నుంచి బయటపడతారు.


శుభకాలం. బ్రహ్మాండమైన కార్యసిద్ధీ ధనలాభం ఉన్నాయి. ఉత్సాహం పెరుగుతుంది. తెలివితేటలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఇష్టదైవారాధనతో శాంతి పెరుగుతుంది.


శుభ ఫలితాలున్నాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి. వ్యాపార లాభముంది. ఆదాయ మార్గాలను పెంచాలి. ముఖ్య నిర్ణయాల్లో స్పష్టత అవసరం. పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి తగ్గుతుంది. దైవబలం కాపాడుతోంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆదిత్య హృదయం చదువుకోండి, ఆపదలు తొలగుతాయి.


ఆత్మవిశ్వాసం గొప్పవారిని చేస్తుంది. ఆశయం నెరవేరుతుంది. అధికారలాభం సూచితం. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. దగ్గరివారి సలహా శక్తినిస్తుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. ఆవేశపరిచేవారుంటారు. సౌమ్యంగా మాట్లాడాలి. వారాంతంలో ఆనందించే అంశాలుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు.


వ్యాపారంలో విజయం లభిస్తుంది. విశేష లాభాలుంటాయి. సకాలంలో పనులు ప్రారంభించండి. వాయిదా వేయవద్దు. భవిష్యత్తులో నష్టం రాకుండా జాగ్రత్తపడాలి. ఆవేశం పనికిరాదు, నిగ్రహంతో లక్ష్యాన్ని చేరాలి. చంచల నిర్ణయాలతో కాలం వృథా చేయొద్దు. ధర్మం ముందుకు నడిపిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. విష్ణునామస్మరణ మంచిది.


బ్రహ్మాండమైన కార్యసిద్ధి సూచితం. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభిస్తే మీలోని శక్తి తెలుస్తుంది. తిరుగులేని ఫలితం వస్తుంది. విజయాలు సొంతం అవుతాయి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. ధనలాభం ఉంది. సూర్యనమస్కారం చేయండి, ప్రశాంతత లభిస్తుంది.


కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆత్మీయుల సూచనలు ఉపయోగపడతాయి. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. నిజాయతీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. సత్యనిష్ఠతో ఆలోచించాలి. సందేహించవద్దు. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగుతాయి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.


ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. కొన్ని పనుల్లో విజయం ఉంటుంది. దృఢసంకల్పంతో పనిచేయండి. అనుకున్న ఫలితాలు త్వరగా వస్తాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. చంచలత్వం పనికిరాదు. ఆవేశపడవద్దు. తెలియని అంశాల్లో తల దూర్చవద్దు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది. చంద్రశ్లోకం చదవండి, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.


ఉద్యోగఫలితం ఉత్తమం. మంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. విఘ్నాలున్నాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. వెతుకుతున్నది దొరుకుతుంది. కాలం సహకరిస్తుంది. అపోహలు తొలగుతాయి. సత్యం బయటపడుతుంది. గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శివారాధన ఉత్తమం.


శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. సకాలంలో స్పందించడం వల్ల మీ ద్వారా కొందరికి మేలు జరుగుతుంది. మీరు అనుకున్నది ఈ వారం నెరవేరుతుంది. ధర్మం గెలుస్తుంది. ఆపద తొలగుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. సంశయాలు తొలగుతాయి. మంచి భవిష్యత్తుతోపాటు అభీష్టసిద్ధి ఉంది. ఆదిత్యహృదయం చదవండి, శాంతి లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని