Weekly Horoscope: రాశిఫలం (సెప్టెంబరు 24 - సెప్టెంబరు 30)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 24 Sep 2023 15:40 IST


ముఖ్యకార్యాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. అభీష్టం సిద్ధిస్తుంది. పనులు పూర్తవుతాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలూ సాహసోపేతమైన నిర్ణయాలూ మేలుచేస్తాయి. కాలం వృథా చేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఇష్టదేవతను స్మరిస్తే శుభం జరుగుతుంది.


వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. ఆర్థికంగా బలపడతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చవద్దు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికతోనే ఒత్తిడిని ఎదుర్కొనగలుగుతారు. పనులు వాయిదా వేయవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, శుభవార్త వింటారు.


శ్రేష్ఠమైన ఫలితాలు సాధిస్తారు. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు. విశేష శుభ యోగాలున్నాయి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. తొందరవద్దు. సాధ్యాసాధ్యాలు ఆలోచించి కృషిచేయాలి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. సూర్య అష్టోత్తరం చదువుకుంటే మంచిది.


అదృష్టయోగముంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది. అనుకూలమైన సమయం. కొన్ని సమస్యలు తొలగుతాయి. వ్యాపార లాభాలున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలి. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. లక్ష్మీదేవిని స్మరించండి, శుభం జరుగుతుంది.


బుద్ధిబలంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. భాగ్య బృహస్పతి అనుగ్రహం వల్ల అపారమైన జ్ఞానసంపద లభిస్తుంది. నమ్మకంతో పనిచేయండి, ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారంలో ఒడుదుడుకులుంటాయి. మొహమాటంతో ఇబ్బందిపడవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


విశేష ధనయోగం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడు పూర్తిచేస్తే సమస్యలు ఉండవు. బాధ్యతాయుతమైన ప్రవర్తన స్థిరమైన ఫలితాన్నిస్తుంది. కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. స్వీయనిర్ణయాలు మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే ప్రశాంతత లభిస్తుంది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి, శుభం జరుగు తుంది. అద్భుతమైన వ్యాపారయోగం సూచితం. వ్యాపారం బాగుంటుంది. పలుమార్గాల్లో విజయాన్ని పొందుతారు. దేనికీ తొందరవద్దు. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆపదలు దగ్గరదాకా వచ్చి కొద్దిగా ఇబ్బందిపెడతాయి. సూర్యదర్శనం మేలుచేస్తుంది.


మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో బ్రహ్మాండ మైన ఫలితాలుంటాయి. అధికార యోగం సూచితం. సరైన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. ఎదురుచూస్తున్న పనులు త్వరగా పూర్తవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసివస్తాయి. కొందరికి బాసటగా నిలుస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి, వెతుకుతున్నది దొరుకుతుంది.


అదృష్టకాలం కొనసాగుతోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్నిస్తుంది. క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆలోచనలకు పరిమితం కాకుండా కార్యాచరణ ప్రారంభించండి. పలుమార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు. మీ వల్ల కొందరు లాభపడతారు. భూ గృహ వాహనాది లాభాలున్నాయి. మహాలక్ష్మిని స్మరిస్తే మంచిది.


మనోబలంతో పనిచేసి విజయం సాధించాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలో ముందుకెళ్లడమే మంచిది. దగ్గరివారి సహకారం తీసుకోవాలి. వాస్తవాలకు దగ్గరగా, సృజనాత్మకంగా పనిచేయండి. ఉద్యోగంలో మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. ఓర్పుతో వేచివుండండి, వారాంతంలో ధైర్యాన్నిచ్చే వార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి. విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. త్వరగా పనులు పూర్తిచేయాలనే తొందరలో పొరపాట్లు చేయవద్దు. తోటివారి సహకారం అందుతుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, కుటుంబంతో ఆనందిస్తారు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


అదృష్టయోగముంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సుస్థిరమైన పదవీయోగముంది. స్వయంకృషితో ఉద్యోగంలో సముచిత స్థానం సాధిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. మంచి పనులకై కాలాన్ని వినియోగించి చక్కని భవిష్యత్తుని సొంతం చేసుకుంటారు. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..