ఐదు రకాల ధ్యానాలు

బోధివృక్షం నీడలో జ్ఞానోదయమయ్యాక బుద్ధుడు ఏడు రోజుల పాటు ఏకాంతంగా మోక్షానందాన్ని అనుభవించాడు.

Updated : 14 Mar 2023 13:16 IST

బోధివృక్షం నీడలో జ్ఞానోదయమయ్యాక బుద్ధుడు ఏడు రోజుల పాటు ఏకాంతంగా మోక్షానందాన్ని అనుభవించాడు. తర్వాత తన ఆధ్యాత్మిక సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ 5 రకాల ధ్యానాలను బోధించాడు. మొదటిది ప్రేమధ్యానం. ఇందులో సకల జీవుల యోగక్షేమాలను మనసారా కాంక్షించాలి. శత్రువులు కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి. రెండోది కరుణ ధ్యానం. దుఃఖంలో ఉన్నవారిని తలచు కుని మృదువుగా, చల్లగా ఉండాలి. వారిపై సానుభూతి చూపాలి. మూడోదైన సంతోష ధ్యానంలో ఇతరుల సంక్షేమం, సౌభాగ్యం మనదిగా భావించాలి. నాలుగోది మాలిన్య ధ్యానం. ఈ ధ్యానావస్థలో అవినీతి, అక్రమం, అన్యాయం లాంటి మాలిన్యాలతో దుష్ఫలితాలు కలుగుతాయి కనుక వాటిని రూపుమాపేందుకు సంకల్పించుకోవాలి. అయిదోది శాంతిధ్యానం. ఇందులో రాగద్వేషాలు, అరిషడ్వర్గాలకు అతీతంగా జీవించాలని దీక్షబూనాలి. ఈ అయిదు ధ్యానాలతో పరిపూర్ణ ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది అన్నాడు తథాగతుడు.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు