కరాచీలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం

శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి ఆలయాల్లో  పాకిస్థాన్‌లోని కరాచీలో  స్వయంభువుగా వెలసిన క్షేత్రం పాక్‌లోని కరాచీలో ఉంది. శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది. 

Updated : 14 Mar 2023 17:49 IST

శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది. 

రాముడు దర్శించిన క్షేత్రం

వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడయింది.

స్వయంభువుగా వెలసిన స్వామి

శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలసినట్టు తెలుస్తోంది.  పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది. ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తుంది.  ఈ ఆలయంలో మూలవిరాట్‌ ఉన్న ప్రాంగణంలో  21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు.  ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారు. పాక్‌లోని కరాచీలో హిందువులకు శ్రీ పంచముఖి  హనుమాన్‌ ఆలయం పవిత్రమైన ప్రదేశం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని