మంత్రాలూ మర్మాలూ లేవు

ఒకరోజు జిబ్రీ అనే చిన్నారి ద్వారకామాయికి వచ్చింది. ‘సాయీ! మీరు అందరికీ సాయం చేస్తారు కదా! మీ దగ్గర ఏమైనా శక్తులున్నాయా?’ అనడిగింది.

Updated : 27 May 2022 17:22 IST

ఒకరోజు జిబ్రీ అనే చిన్నారి ద్వారకామాయికి వచ్చింది. ‘సాయీ! మీరు అందరికీ సాయం చేస్తారు కదా! మీ దగ్గర ఏమైనా శక్తులున్నాయా?’ అనడిగింది.

సాయి నవ్వి ‘ఈ కలికాలంలో తోటివారికి సాయం చేయడం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. అందువల్ల నీకిది ఆశ్చర్యం కలిగించింది. సాయం చేయడం అనేది చాలా మందికి చమత్కారంగా, నవ్వులాటగా, నమ్మలేని విధంగా కనిపిస్తోంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి దేవుడు ప్రత్యేకంగా దిగిరాడు. ‘దైవం మానుష రూపేణా’ అన్నట్లు నీ చేతనో లేదా నావంటి ఫకీర్ల ద్వారానో ఆ సాయం అందేలా చేస్తాడు. మనలో ఇతరులకు సాయపడాలన్న తపన ఉంటే చాలు దేవుడు తన శక్తిలో కొంత భాగాన్ని మనకి ఇస్తాడు. దీనినే అద్భుత శక్తులు అనుకుంటారు. నిజానికి అలాంటి శక్తిని అందరికీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మంచి పనులకు, సాయం చేయడానికి మంత్రాలూ మర్మాలూ ఏమీ లేవు. తోటివారికి సాయం చేస్తే ఎలాంటి ఆనందం, తృప్తి కలుగుతుందో చెప్పడానికే నేను షిరిడివాసులకు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సాయం చేస్తున్నాను. ఒకరికి సేవ చేయడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది జిబ్రీ’ అన్నాడు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని