కోపం... కసి...

ఆ ఏడాది షిర్డీ దగ్గర్లోని ఆ ఊళ్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తన పొలం ఎండిపోతుంటే జీవా అనే రైతు తన పొలానికి దగ్గర్లో ఉన్న కామందు గంగారాం బావి లోంచి నీళ్లు వాడుకుని సాగు చేశాడు. దిగుబడి అందరికన్నా ఎక్కువగా ఉండటంతో

Updated : 14 Mar 2023 15:24 IST

ఏడాది షిర్డీ దగ్గర్లోని ఆ ఊళ్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తన పొలం ఎండిపోతుంటే జీవా అనే రైతు తన పొలానికి దగ్గర్లో ఉన్న కామందు గంగారాం బావి లోంచి నీళ్లు వాడుకుని సాగు చేశాడు. దిగుబడి అందరికన్నా ఎక్కువగా ఉండటంతో గంగారాం కన్ను కుట్టింది. తనకు సగం వాటా ఇవ్వాలంటూ గ్రామపెద్దకు ఫిర్యాదు చేశాడు. వాటా ఇవ్వడం న్యాయమని, లేదంటే జీవా పొలాన్ని తగులబెట్టమని గ్రామపెద్ద తీర్పు చెప్పడంతో పంటతో ఉన్న పొలాన్ని గంగారాం కాల్చేశాడు. జీవాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆవేశంతోనే కొద్ది దూరంలోనున్న రాతి భూమిలో బావిని తవ్వడం మొదలు పెట్టాడు. ఎంత శ్రమించినా రాతి పొరలే తప్ప నీరు పడక పోవడంతో మరింత కసిగా తండ్రినీ, ఆయన తెచ్చిన భోజనాన్ని కూడా పక్కకు తోసేసి తవ్వసాగాడు. సరిగ్గా అప్పుడే సాయిబాబా అటు పక్కగా వెళ్తుండటం చూశాడు జీవా తండ్రి. పరుగున వెళ్లి జరిగింది చెప్పి దుఃఖించాడు. అప్పుడు సాయి జీవాని సమీపించి ‘కోపం, కసితో చేసే పనులేవీ సత్ఫలితాలివ్వవు. నిర్మలంగా దైవాన్ని స్మరిస్తూ బావిని తవ్వి చూడు! మనసు కక్షతో నిండి ఉంటే ప్రయాణించాల్సిన విజయపు దారి కూడా చీకటిగానే కనిపిస్తుంది. చెడు ఆలోచనలను రానీయక, దైవసంకల్పంతో పని చెయ్యి’ అన్నాడు. జీవా దేవుణ్ణి తల్చుకుని పలుగుతో రాతినేల మీద కొట్టగానే ఎన్నాళ్లు తవ్వినా కనిపించని నీరు ధారగా పైకి చిమ్మింది.   

   - ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని