ధృతరాష్ట్రుడికి బోధించిన సనత్సుజాతుడు

బ్రహ్మమానస పుత్రుల్లో సనత్సుజాత మహర్షి ఒకరు. ఆయన ధృతరాష్ట్రుడికి చెప్పిన బ్రహ్మవిద్య, మృత్యువు తదితర యోగాంశాలే సనత్సుజాత గీత. బ్రహ్మ విద్య తెలుసుకోవటం వల్ల కలిగే లాభాలు, మృత్యువును ఎలా తప్పించు కోవచ్చనే విషయాలు ఇందులో ఉన్నాయి.

Updated : 14 Mar 2023 15:22 IST

బ్రహ్మమానస పుత్రుల్లో సనత్సుజాత మహర్షి ఒకరు. ఆయన ధృతరాష్ట్రుడికి చెప్పిన బ్రహ్మవిద్య, మృత్యువు తదితర యోగాంశాలే సనత్సుజాత గీత. బ్రహ్మ విద్య తెలుసుకోవటం వల్ల కలిగే లాభాలు, మృత్యువును ఎలా తప్పించు కోవచ్చనే విషయాలు ఇందులో ఉన్నాయి. భాగవతాన్ని అనుసరించి సనక, సనాతన, సనందన, సనత్కుమారులు నలుగురూ బ్రహ్మమానస పుత్రులు. కానీ మహా భారత కథనం ప్రకారం అనిరుద్ధ, సనత్సుజాత, సనక, సనందన, సనత్కుమార, కపిల, సనాతనులనే ఏడుగురు మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు. వీరే వేదవాఙ్మయ విజ్ఞానాన్ని విస్తరింపచేశారు. భారతంలో పలు ధర్మ సందేహాలకు సనత్కుమారులు, సనత్సుజాత మహర్షి సమాధానాలు చెప్పినట్టు కనిపిస్తుంది. మహాభారతం ఉద్యోగపర్వంలో సనత్సుజాతుడు చేసిన ఈ నీతిబోధ సనత్‌ సుజాతీయం పేరున కూడా ప్రసిద్ధం.

ధృతరాష్ట్రుడు సనత్సుజాత మహర్షిని పూజించి బ్రహ్మవిద్యను అర్థించగా అతడు బోధించాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ‘మృత్యువు నిజంగా ఉందా లేదా?’ అనడిగితే ‘మృత్యువు ఉంది. బ్రహ్మచర్య పాలనతో అపమృత్యువు తొలగుతుంది. సోమరితనం విడిచి అప్రమత్తతతో గడిపితే మృత్యువు సమీపించదు’ అంటూ వివరించాడు మహర్షి. 

- మల్లు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని