సర్వం సాయిమయం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, యోగిరాజ- అంటూ భక్తులు శిరిడీ సాయినాథుణ్ణి దిక్కులు పిక్కటిల్లేలా కీర్తిస్తారు. అప్పుడా వాతావరణంలో గొప్ప ప్రశాంతత, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతాయి.

Updated : 14 Mar 2023 15:20 IST

ఖిలాండకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, యోగిరాజ- అంటూ భక్తులు శిరిడీ సాయినాథుణ్ణి దిక్కులు పిక్కటిల్లేలా కీర్తిస్తారు. అప్పుడా వాతావరణంలో గొప్ప ప్రశాంతత, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతాయి. తనను నమ్మినవారి వెంట ఉండి సదా రక్షిస్తానన్నాడు సాయి. ప్రతి మనిషిలో తనను చూడమన్నాడు. అన్నార్తులకు గుప్పెడు అన్నం పెడితే తనకు కడుపు నిండుతుందన్నాడు. సంయమనాన్ని పాటించమని, ఎవరే మార్గాన పయనించినా గమ్యం చేరడమే లక్ష్యమని అన్నాడు. ‘సబ్‌ కా మాలిక్‌ ఏక్‌ హై’ అనే దివ్యసందేశాన్ని ఇచ్చిన బాబా కంటే లౌకిక వాదులెవరూ లేరు.

ఆదిశంకరుల అద్వైతాన్నే రామకృష్ణ పరమహంస, సాయిబాబా వంటి సద్గురువులు మళ్లీ ప్రబోధించారు. భజగోవిందం, సౌందర్యలహరిలో శంకరుల సహజీవన విధానాన్ని గురించి నొక్కి చెప్పారు. ప్రతి మనిషి సాటివారితో కలిసిమెలిసి జీవనం సాగించడం ద్వారా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించవచ్చునన్నదే ఆ మహనీయుడి బోధల సారాంశం. గురువు మీద భక్తుడికి, భక్తుడిపై గురువుకీ సద్భావం ఉన్నప్పుడే అది సాధ్యమౌతుంది. మానవ సంబంధాలు విద్వేషపూరితం అవుతున్న ఈ రోజుల్లో సాయినాథుని ప్రబోధలు ఎంతైనా మేలు చేస్తాయి.

- నాగలక్ష్మీ శ్రీప్రద అగ్నిహోత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని