సంగీత సాధన

స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాల్లోనే కాదు సంగీత సాధనలోనూ ప్రావీణ్యత సంపాదించారు. శ్రావ్యమైన కంఠంతో భావయుక్తంగా గానం చేస్తుంటే శ్రోతలు పరవశించేవారు.

Updated : 23 Mar 2023 17:10 IST

స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాల్లోనే కాదు సంగీత సాధనలోనూ ప్రావీణ్యత సంపాదించారు. శ్రావ్యమైన కంఠంతో భావయుక్తంగా గానం చేస్తుంటే శ్రోతలు పరవశించేవారు. పాఠశాల, కళాశాలల్లో ఆయన తన సంగీతంతో అలరించేవారు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస శిష్యుడి రాగాలాపనకు భావసమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. వివేకానంద ఆనాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన వేణీమాధవ్‌, ఉస్తాద్‌ అహ్మద్‌ ఖాన్‌ల వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. సుప్రసిద్ధ ద్రుపద్‌ సంగీత విద్వాంసుడైన జ్వాలాప్రసాద్‌ వద్ద సంగీతం కూడా అభ్యసించారు. కాశీనాథ్‌ ఘోశాల్‌ వద్ద తబలా, పక్వాజ్‌ తదితర సంగీత వాయిద్యాలను నేర్చుకున్నారు. ఒకసారి వివేకానంద మిత్రుడు ఒకరు వేదికపై శరీరాన్ని వివిధ భంగిమల్లో కదులుస్తూ, కచేరీ చేస్తున్నాడు. అది గమనించిన వివేకానంద వేదిక దిగగానే మిత్రుడితో ‘సంగీతమంటే కేవలం రాగతాళాలు మాత్రమే కాదు. భావం, వాచ్యం కూడా ముఖ్యమే. కానీ అనవసరమైన కదలికలు ఆలాపనకు మంచిది కాదు. సంగీతం ఉత్తమోత్తమ కళ. ఈ సాధన కూడా భగవదారాధనే’ అంటూ సంగీత విశిష్టతను వివరించారు.                  

 చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని