సంసారమంటే..

‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?’- అనడిగాడు శిష్యుడు.

Updated : 14 Mar 2023 13:34 IST

‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?’- అనడిగాడు శిష్యుడు. ఆ ప్రశ్నకు ‘సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?’ అని ఎదురు ప్రశ్నించారు రమణులు. ‘ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది’ అన్నాడతను. దానికాయన నవ్వి ‘అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?’ అన్నారు. శిష్యుడు ఆశ్చర్యపోయి ‘ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి?’ అన్నాడు. ‘మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం. ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం. సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు’ అంటూ వివరించారు.

 లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని