కపటం దాగదు

కపటం, మోసం ఎంత దాచినా దాగవంటూ విద్యాప్రకాశానందగిరి ఓ కథ చెప్పారు... పూర్వం ధనికుడు, విధ్యాధికుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు.

Updated : 14 Mar 2023 13:15 IST

పటం, మోసం ఎంత దాచినా దాగవంటూ విద్యాప్రకాశానందగిరి ఓ కథ చెప్పారు... పూర్వం ధనికుడు, విధ్యాధికుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భాగవత ప్రవచనం ఏర్పాటుచేసి, శ్రోతలకు ప్రసాదాలు వితరణ చేయసాగాడు. కథ వింటూ ఆనందబాష్పాలు రాల్చేవారిని భాగవతోత్తములుగా భావించేవాడు. పరవశంతో కథ విన్నవారికి ప్రవచనం ముగియగానే తన ఇంట్లో భోజనం లభిస్తుందని ప్రకటించాడు. అది విన్న ఓ కపటి కంట తడి పెట్టాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో వంటశాలలో బతిమాలి మిరియాల పొడి తీసుకున్నాడు. అది కళ్లలో వేసుకుని ప్రవచనం వింటూ కన్నీరు కార్చాడు. అది చూసి గొప్ప తన్మయం పొందిన భక్తుడు అనుకుని ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. తన పాచిక పారిందని కపట భక్తుడు సోమరులకు మిరియాల పొడి ఉపాయం చెప్పాడు. అలా ఎందరో విందు ఆరగించసాగారు. ఇలా కొన్నిరోజులు గడిచాయి. ఒకరోజు మిరియాలపొడి చాలా అవసరమౌతోందని నిర్వాహకుణ్ణి అడగటంతో అప్పుడే ఎలా అయిపోయిందని ఆశ్చర్యపోయాడు. వంటలో వాడుతున్న దాని కంటే ప్రవచన భక్తులు అడిగి తీసుకుంటున్నదే ఎక్కువని తేలింది. దాంతో కపటభక్తుల ఆనందపారవశ్యం అర్థమైంది. గీతలో కృష్ణుడు ‘భజతా ప్రీతి పూర్వకమ్‌’ అన్నది ఇలాంటి కపటులను ఉద్దేశించే. సర్వాంతర్యామి అన్నిటినీ, అందరినీ గమనిస్తూనే ఉంటాడని గ్రహించి ఆయన్ను భక్తితో వశం చేసుకోవాలే గానీ మోసంతో కాదు.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని