పిలల్ని ప్రేమించే లాఫింగ్‌ బుద్ధ

అమెరికాలో చైనాటౌన్‌కు వెళ్లిన వారికి.. అక్కడ నారసంచి భుజాన వేళ్లాడుతున్న భారీ విగ్రహాలు కనిపిస్తాయి. వ్యాపారులు వాటిని ‘హ్యాపీ చైనామ్యాన్‌’ అని ‘లాఫింగ్‌ బుద్ధా’ అని పిలుస్తారు.

Published : 13 Apr 2023 00:24 IST

అమెరికాలో చైనాటౌన్‌కు వెళ్లిన వారికి.. అక్కడ నారసంచి భుజాన వేళ్లాడుతున్న భారీ విగ్రహాలు కనిపిస్తాయి. వ్యాపారులు వాటిని ‘హ్యాపీ చైనామ్యాన్‌’ అని ‘లాఫింగ్‌ బుద్ధా’ అని పిలుస్తారు. ఎందరికో ఆరాధ్య దైవమైన ఈ హ్యాపీ చైనా మ్యాన్‌ తాంగ్‌ రాజవంశానికి చెందినవాడు. ఆయనకు జెన్‌ మాస్టర్‌ అని పిలిపించుకోవాలని గానీ చుట్టూ శిష్యగణాన్ని పోగుచేసు కోవాలని కానీ ఎంతమాత్రం కోరిక లేదు. ఎప్పుడూ ఒక పెద్ద నారసంచి తగిలించుకుని వీధుల్లో వెళ్తుండేవాడు. అందులో ఉన్న పండ్లు, మిఠాయిలు, మరేవో తినుబండారాలు, కానుకలను కనిపించిన పిల్లలకు పంచిపెట్టేవాడు. అలా వీధుల్లో బాల శిక్షణాలయాన్ని నెలకొల్పాడు.
జెన్‌ భక్తులు, సాధువులు కనిపిస్తే మాత్రం చెయ్యి ముందుకు చాచి ‘కొంచెం దానం చేయండి’ అనేవాడు.
ఒకసారి ఓ జెన్‌ మాస్టర్‌ను కలిసినప్పుడు మాటల మధ్యలో ‘అసలు జెన్‌ గొప్పతనం ఏమిటి?’ అనడిగాడు.
అంతే ఆ జెన్‌గురువు ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. ‘ఇదేం ప్రశ్న?!’ అన్నట్టు నోట మాట లేకుండా నేల మీద కూర్చుండిపోయాడు. అతడలాగే చూస్తోంటే ‘నేను అడిగిందానికి బదులివ్వనే లేదు.. జెన్‌ అసలు స్వరూపమేంటో చెప్పండి?’ అనడిగాడు మళ్లీ.

జెన్‌ మాస్టర్‌ కళ్లు తేలేశాడు. హ్యాపీ చైనామ్యాన్‌ భుజానున్న సంచిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని