ధాత

విష్ణుసహస్రనామావళిలో ఇది 43 వది. ధాత అంటే సృష్టికర్త అని అర్థం. సకల జీవరాశినీ సృష్టించేది ఆయనే అనే విషయం సహస్రనామాల్లో తరచుగా వినిపిస్తుంది.

Published : 13 Apr 2023 00:23 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 43 వది. ధాత అంటే సృష్టికర్త అని అర్థం. సకల జీవరాశినీ సృష్టించేది ఆయనే అనే విషయం సహస్రనామాల్లో తరచుగా వినిపిస్తుంది. ఇది ఆ స్వామి శక్తిని నిరంతరం స్మరించుకోమని భక్తులకు చెప్పేందుకే. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే జీవుల పట్ల దయ అనేది ప్రతి భక్తుడిలోనూ నిత్యం వృద్ధి చెందుతుంది. సృష్టికర్త అంటే మనందరికీ తెలిసిన చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మను కన్న వాడు ధాత. అంత మహిమాన్వితుడు ఆ స్వామి అని ఈ నామానికి అంతరార్థం. 

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని