అడగకుండానే ఇచ్చేస్తాడు
అవతార్ మెహర్‌బాబా ఏ విషయాన్నయినా చక్కగా విశ్లేషించేవారు. ఒకసారి ప్రేమను నిర్వచిస్తూ.. ‘ఇహలోకంలో ప్రేమకు మల్లేనే దైవారాధనలోనూ సంఘర్షణ, సందేహం, త్యాగం ఉంటాయి.
అవతార్ మెహర్‌బాబా ఏ విషయాన్నయినా చక్కగా విశ్లేషించేవారు. ఒకసారి ప్రేమను నిర్వచిస్తూ.. ‘ఇహలోకంలో ప్రేమకు మల్లేనే దైవారాధనలోనూ సంఘర్షణ, సందేహం, త్యాగం ఉంటాయి. ఇక్కడ భౌతిక సుఖాలకు చెందిన క్షణిక సుఖసౌఖ్యాలు లభిస్తే దైవ ప్రేమలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే నిధి ప్రాప్తిస్తుంది. నిజమైన భక్తుల్లో ఈర్ష్య, అసూయ, ద్వేష భావాలు నశిస్తాయి. ప్రతి జీవిలో దేవుణ్ణే చూస్తారు. దీన్నే ఉపనిషత్తులు ‘సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాన్త ఉపాసీత్’, ‘ఏకం సత్ విప్రా బహుధా వదన్తి’ అంటూ వర్ణించాయి. ప్రేయసిని తరచూ కలుసుకోవాలి, మాట్లాడాలి, ఆమె సమక్షంలో గడపాలి అని ప్రేమికుడెలా ఆతృతచెందుతాడో దైవారాధనలోనూ అలాగే తపించాలి. అదే ప్రగాఢ ఉత్కంఠ. భగవత్ ప్రేమలో ధనికులు, పేదలు, కులాలు, మతాలు లాంటి హెచ్చుతగ్గులు, భేదాలను భగవంతుడు పాటించడు. అద్వైతాన్నే ఇష్టపడతాడు. భక్తులు అహంకారాలూ, ఆడంబరాలూ లేకుండా ‘నువ్వూ నేనూ వేరు కాదు, మనం ఒక్కరిమే’ అంటూ లీనమైపోవాలి. కోరికలూ, దర్పాలతో నిండిన హృదయాల్లో స్వామి ప్రవేశించడు. వాటిని విడిచి చూడండి.. ఇక మీ గుండెల్లోనే తిష్టవేసి కూర్చుంటాడు. కొందరు దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరికల చిట్టా విప్పుతుంటారు. ఇది సరికాదు. అందరూ బాగుండాలని ప్రార్థించి చూడండి.. మీ గురించి ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు’ అంటూ చెప్పారు మెహర్‌బాబా.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్