స్వామి ఆకలి తీరింది

పళని సుబ్రహ్మణ్యస్వామి కొండకు దిగువలో ఒక పండ్ల వ్యాపారి అంగడి ప్రారంభించాడు. కొండ పైకి వెËళ్లేందుకు రవాణా సౌకర్యం లేని కాలమది. వ్యాపారికి స్వామి పట్ల అపార భక్తి.

Published : 18 May 2023 00:08 IST

పళని సుబ్రహ్మణ్యస్వామి కొండకు దిగువలో ఒక పండ్ల వ్యాపారి అంగడి ప్రారంభించాడు. కొండ పైకి వెËళ్లేందుకు రవాణా సౌకర్యం లేని కాలమది. వ్యాపారికి స్వామి పట్ల అపార భక్తి. అందుకే తనవద్ద పనిచేసే కూలీతో రోజూ బుట్టెడు పండ్లను నైవేద్యం కోసం పంపించే వాడు. కూలీ కూడా మహా భక్తుడే. ఒక్క పండు కూడా తినకుండా దైవాన్ని స్మరిస్తూ కొండమెట్లు ఎక్కి స్వామివారికి సమర్పించి వచ్చిన తర్వాత భోజనం చేసేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి.

ఒకరోజు ఎప్పట్లాగే యజమాని ఇచ్చిన పండ్లను తీసుకెళ్తుండగా నీరసంతో కళ్లు తిరిగి పడిపోయాడు. కొద్దిసేపటికి తేరుకొని, స్వామిని స్మరించి, క్షమాపణ చెప్పుకుని నాలుగు పండ్లు భుజించి మిగిలినవి సమర్పించి వచ్చేశాడు. ఈ సంఘటన గురించి యజమానికి చెప్పలేదు.

ఆరోజు రాత్రి స్వామివారు వ్యాపారికి కలలో సాక్షాత్కరించి, ‘నువ్వు రోజూ బుట్ట నిండా పండ్లు పంపుతున్నావు. నిజానికి ఈ రోజు మాత్రమే నాలుగు పండ్లు నాకు అందాయి. నా ఆకలి తీరింది’ అంటూ అంతర్థానమయ్యారు. ఆశ్చర్యపోయిన వ్యాపారి మర్నాడు కూలీని పిలిచి తన స్వప్నాన్ని ప్రస్తావించి ‘నిజం చెప్పు, ఇన్నాళ్లుగా పండ్లన్నీ దేవాలయంలో ఇస్తున్నావా? లేక దుర్వినియోగం చేస్తున్నావా?’ అని గదమా యించాడు. దాంతో కూలీ ముందురోజు ఏమైందో పూసగుచ్చినట్లు చెప్పాడు. వ్యాపారి విస్మయం చెందాడు. యదార్థం బోధ పడింది. పేదలకు ఇచ్చే ఆహారం పరమాత్మకు చేరు తుందనే సత్యాన్ని గ్రహించాడు. నాటి నుంచి కొండకు వెళ్లే పేదల ఆకలి తీరుస్తూ వారి సంతోషంలో భగవంతుణ్ణి దర్శిస్తూ ధన్యుడయ్యాడు.

పరాశరం సచ్చిదానంద మూర్తిఇది పళని క్షేత్రంలో జరిగిన యదార్థ సంఘటన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని