పద్మనాభః

విష్ణుసహస్రనామావళిలో ఇది 48 వది. ‘పద్మనాభః’ అంటే నాభిలో పద్మం గలవాడు అనేది పైకి కనిపించే అర్థం. నిజానికి ఎంతో లోతైన భావం ఉంది. పద్మం నుంచే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించాడు.

Published : 18 May 2023 00:08 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 48 వది. ‘పద్మనాభః’ అంటే నాభిలో పద్మం గలవాడు అనేది పైకి కనిపించే అర్థం. నిజానికి ఎంతో లోతైన భావం ఉంది. పద్మం నుంచే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించాడు. పద్మం జ్ఞానానికి ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తితో బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులూ ఉద్భవించడానికి కారకుడయ్యాడు అనే భావం ఇందులో దాగి ఉంది. సృష్టిలోని జ్ఞానమంతా ఆయన లోదే అనే అర్థం స్ఫురిస్తుంది. జ్ఞానార్జన చెయ్యాలి అనుకున్నవారు ఆ స్వామిని ఆరాధించాలనే అర్థం కూడా ఈ నామంలో కనిపిస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని