పిడికిలి మహిమ
మొకుసేన్ హికీ నివాసం జపాన్ తంబా జిల్లాలోని బౌద్ధాలయంలో. ఆయనంటే అందరికీ భక్తి ప్రపత్తులు. ఏదైనా సమస్య ఉంటే మొకుసేన్‌తో చెప్పుకుంటే పరిష్కారమైపోతుందని నమ్మేవారు. ఒకరోజు ఓ అనుచరుడు మాటల మధ్యలో ‘నా భార్య నాకు పూర్తి వ్యతిరేకం.
మొకుసేన్ హికీ నివాసం జపాన్ తంబా జిల్లాలోని బౌద్ధాలయంలో. ఆయనంటే అందరికీ భక్తి ప్రపత్తులు. ఏదైనా సమస్య ఉంటే మొకుసేన్‌తో చెప్పుకుంటే పరిష్కారమైపోతుందని నమ్మేవారు. ఒకరోజు ఓ అనుచరుడు మాటల మధ్యలో ‘నా భార్య నాకు పూర్తి వ్యతిరేకం. లోకంలో ఏదీ శాశ్వతం కాదని తెలిసినా.. ఆవిడెందుకో లోభత్వం చూపుతుంది. నా ఆలోచనలను సమర్థించకపోగా ప్రతి దాంట్లో అడ్డొస్తుంటుంది. ఆమె కారణంగా నేను ఎవరికీ ధన సాయం చేయలేకపోతున్నాను’ అంటూ వాపోయాడు.
మర్నాడు మొకుసేన్ హికీ ఆ అనుచరుడి ఇంటికి వెళ్లాడు.
అతడి భార్య పలకరించగానే.. పిడికిలి బిగించి ఆమె ముఖం ముందు పెట్టాడు.
ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ‘ఏంటిది? ఎందుకిలా పిడికిలి చూపుతున్నారు? దీనర్థం ఏమిటి?’ అనడిగింది.
‘ఒకవేళ నా చెయ్యి ఎప్పుడూ ఇలాగే ఉందనుకోండి.. మీరంతా ఏమనుకుంటారు? ఏమని పిలుస్తారు?’
‘అయ్యో. చెయ్యి అలా బిగుసుకుపోయింది కాబోలు అనుకుంటాం’ అందామె ఇంకా ఆశ్చర్యం లోంచి తేరుకోకుండానే.
మొకుసేన్ పిడికిలి తెరిచి, ఈసారి చేతిని దెబ్బ వేస్తున్న భంగిమలో ఉంచి ‘ఈ చెయ్యి గనుక ఎప్పుడూ ఇలాగే ఉందనుకోండి.. అప్పుడేమనిపిస్తుంది?’ మళ్లీ అడిగాడు.
‘అలా అయ్యింది కాబోలు.. ఇక ఎన్నటికీ మామూలుగా ఉండదేమో అనుకుంటాం’ నెమ్మదిగా చెప్పిందామె.
‘ఈ మాత్రం అర్థం చేసుకుంటే చాలు.. ఇక సందేహం లేదు.. నువ్వు తప్పకుండా మంచి భార్యవి అవుతావు’ అనేసి అక్కణ్ణించి వెళ్లిపోయాడు మొకుసేన్.
అంతే.. ఆ క్షణంలోనే ఆమెలో పరివర్తన వచ్చింది. తమ సంపాదన ఇంటి ఖర్చులు, పొదుపు చేయడానికి మాత్రమే అనడం మానేసింది. భర్త దానధర్మాలు చేస్తుంటే ఎన్నడూ వ్యతిరేకించకపోగా తనే ముందుండి సాయం చేయసాగింది.
వి.నాగరత్న
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి