వివేకానందను పరీక్షించిన విదేశీవనిత

చికాగోలో స్వామి వివేకానంద పాల్గొన్న సర్వమత మహాసభలకు బ్లోడ్జట్‌ అనే పెద్దావిడ కూడా హాజరయ్యింది. యువ స్వామీజీ తన ఉపన్యాసాలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం, వేలాదిమంది జనం గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులతో అభినందనల జల్లుల్ని కురిపించడం జగమెరిగిన సత్యమే.

Published : 08 Jun 2023 00:05 IST

చికాగోలో స్వామి వివేకానంద పాల్గొన్న సర్వమత మహాసభలకు బ్లోడ్జట్‌ అనే పెద్దావిడ కూడా హాజరయ్యింది. యువ స్వామీజీ తన ఉపన్యాసాలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం, వేలాదిమంది జనం గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులతో అభినందనల జల్లుల్ని కురిపించడం జగమెరిగిన సత్యమే. ఆ సమావేశం పూర్తయ్యాక ఎందరో యువతులు వేగంగా వెళ్లాలని బెంచీల మీదుగా స్వామీజీ వద్దకు వెళ్లారు. ఆయన చుట్టూ చేరి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బ్లోడ్జట్‌ ఆ సన్నివేశాన్ని దూరం నుంచే గమనిస్తూ ‘నా ప్రియ పుత్రుడా! ఈ అందగత్తెల తాకిడిని తట్టుకుని, ఆ ప్రలోభాలకు లొంగకుండా నిలబడగలిగితే నిజంగా నువ్వు పురుషోత్తముడివి. సాక్షాత్తూ పరమాత్ముడివి’ అనుకుంది. తర్వాత అమెరికాలో స్వామీజీని వెంబడించి, అతడేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎక్కడా చిన్న అపవాదు ఎదుర్కోకుండా ఆధ్యాత్మిక తరంగంలా సాగి పోతున్న వివేకానంద ప్రస్థానానికి అబ్బుర పడింది. ఎందరో శ్రీమంతులు, సౌందర్య వతులు స్వామిని మోహించినప్పటికీ సోదర భావం చూపి సున్నితంగా తిరస్కరించటం ఆమె దృష్టికి వచ్చింది. ఆ ఆరాధనాభావంతో స్వామీజీ ఛాయాచిత్రాన్ని తన గదిలో అలంకరించుకుంది. ఎవరైనా అతడెవరని అడిగితే ‘ఈ భూమి మీద దేవుడంటూ ఉన్నాడంటే.. అది ఇతనే’ అంటూ జవాబిచ్చేది.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు