ఉచ్చారణ ముఖ్యం

ఆధ్యాత్మికంగా, పాంచభౌతికంగా, కర్మల పరంగా, మానసికంగా.. మనం తినాల్సిన పదార్థాలనూ, వడ్డన చేయాల్సిన పద్ధతినీ ఆయా సందర్భాల్లో చెప్పారు మహర్షులు.

Published : 08 Jun 2023 00:04 IST

ఆధ్యాత్మికంగా, పాంచభౌతికంగా, కర్మల పరంగా, మానసికంగా.. మనం తినాల్సిన పదార్థాలనూ, వడ్డన చేయాల్సిన పద్ధతినీ ఆయా సందర్భాల్లో చెప్పారు మహర్షులు. భక్ష్యం (కొరికి తినగలిగే గారె, బూరె, వడ వంటి పదార్థాలు) భోజ్యం (నములుతూ ఆరగించే పులిహోర, పొంగలి, అన్నం లాంటివి), చోష్యం (జుర్రుతూ ఆరగించే చారు, రసం, మజ్జిగ లాంటివి) లేహ్యం (నాకుతూ తినే చూర్ణం, తేనె వంటివి).. వీటిని ఏయే సమయాల్లో అందుకోవాలి- వంటివన్నీ గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు వివరించాడు. వీటన్నిటికీ ఓ ప్రత్యేక శైలి, ఆచారం ఉన్నాయి. ఇక మౌనం మహా శక్తివంతం. సంభాషణ సాగిస్తున్నప్పుడు అక్షరాలు, పదాలను ఓ క్రమ పద్ధతిలో పలకాలన్నది పెద్దల ఉవాచ. పరుషాలూ, సరళాలూ, నాదాలూ.. వేటి ప్రయోజనం వాటిదే. ఇవన్నీ చక్కగా అనుసరించాలి. అలా కుదరని పక్షంలో.. మౌనాన్ని ఆశ్రయించడమే మనకు రక్షణ, పరులకు ఉపశమనం అన్నారు. ఆయా శ్లోకాలూ, మంత్రాలను సరైన రీతిలో పలకాలి! ఉచ్చారణ చాలా ముఖ్యం. లేకుంటే ఫలితం శూన్యం. ఇది సామాజిక సూత్రమే కాదు, ఆధ్యాత్మిక ధర్మం కూడా.

నాగిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని