అతిథిని ఆదరించాలి!

అన్నదానం గొప్పదని నమ్మిన ఒక నిరుపేద తాను ఆకలితో ఉన్నా.. ఇంటికి వచ్చినవారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఇది తెలిసిన ఒక సోమరి నిత్యం అతడింట్లో భోజనానికి వస్తున్నాడు. విసిగిపోయిన అతడి భార్య- ‘రోజూ వచ్చే వ్యక్తి అతిథి లెక్కకు రాడు.

Published : 13 Jun 2024 00:44 IST

న్నదానం గొప్పదని నమ్మిన ఒక నిరుపేద తాను ఆకలితో ఉన్నా.. ఇంటికి వచ్చినవారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఇది తెలిసిన ఒక సోమరి నిత్యం అతడింట్లో భోజనానికి వస్తున్నాడు. విసిగిపోయిన అతడి భార్య- ‘రోజూ వచ్చే వ్యక్తి అతిథి లెక్కకు రాడు. రేపతడు రాగానే మనం గొడవ పడినట్లు నటిస్తే వెనక్కి వెళ్లిపోతాడు. అతణ్ణి పొమ్మన్నట్టూ ఉండదు, పాపమూ అంటదు’ అంది. ఆ సలహా పాటించగా.. సోమరి అతిథి వెళ్లిపోయాడు. వాళ్లు సంతోషించే లోగానే.. అతడు తిరిగొచ్చి ‘నేనెళ్లిపోయి నట్లు నటించాను, మీకది చేత కాలేదు’ అన్నాడు. నిరుపేద ‘నిజమే! నాకు నటన చేతకాని విద్య. కానీ ఒక మాట విను! శక్తి లేకున్నా అతిథిని దేవుడిలా భావించి, భోజనం పెట్టాలనుకున్నాను. దీన్ని అలుసుగా తీసుకోవడం భావ్యమా? నిస్సహాయులను ఆదుకోవాలి కానీ, ఒకరి మీద ఆధారపడేవారిని కాదు కదా! సోమరిని ఏ దేవుడూ హర్షించడు. శ్రమించి బతికేవారినే కరుణిస్తాడు. ఇన్నాళ్లూ మొహమాటంతో ఈ మాట చెప్పలేకపోయాను. దయచేసి కష్టపడటం అలవాటు చేసుకో. దేహం నశించేంత వరకు పని చేయాలి. సోమరితనం, అశ్రద్ధ ఎన్నటికీ పనికి రావు’ అంటూ ఎంతో సౌమ్యంగా చెప్పాడు. అంతా విన్న సోమరి ‘నన్ను మన్నించు స్వామీ’ అనేసి వెళ్లిపోయాడు. సోమరితనం గురించి వివరిస్తూ- చినజీయర్‌ స్వామి చెప్పిన కథ ఇది.

లక్ష్మి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని