సాయి బోధనలు మహోన్నతం

భక్తి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుందని గురుదేవులెందరో హితవు పలికారు. సాయినాథుడి బోధనల సారమూ అదే.

Published : 11 Jul 2024 00:25 IST

భక్తి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుందని గురుదేవులెందరో హితవు పలికారు. సాయినాథుడి బోధనల సారమూ అదే. బాబా ప్రబోధలు భక్తుల జీవితాల్లో అనేక మార్పులను తెచ్చి, వారి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి. సాయినాథుడు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యత, ఆత్మనివేదన అనే నవవిధ భక్తి మార్గాలను బోధించాడు. అంటే భగవంతుడి లీలలను వినడం, దైవాన్ని నిత్యం స్మరించడం, ప్రార్థించడం బాబా బోధనల్లో ముఖ్యమైనవి. భగవంతుడి పాదాలను పూజించడం, అర్చించడం, ప్రణమిల్లడం ద్వారా భక్తుల్లో అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ధ్యానం, సఖ్యత, ఆత్మ నివేదనలతో మనసును భగవంతుడిపై లగ్నంచేసి శరణాగతి పొందవచ్చని బాబా బోధిస్తారు.

అడపా నాగదుర్గారావు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని