గోవర్ధనగిరి పూజ

గోకులంలో ప్రతీ సంవత్సరం ఇంద్ర యాగం చేసేవారు. ఒకసారి అలా ఇంద్రుణ్ణి పూజించడానికి గోకుల వాసులు బయల్దేరగా శ్రీకృష్ణుడు నందుడితో ‘మనకి ఎన్నడూ సాయం చేయని ఇంద్రుణ్ణి పూజించే బదులు...

Updated : 14 Mar 2023 15:20 IST

అక్టోబరు 26 గోవర్ధనగిరిపూజ

గోకులంలో ప్రతీ సంవత్సరం ఇంద్ర యాగం చేసేవారు. ఒకసారి అలా ఇంద్రుణ్ణి పూజించడానికి గోకుల వాసులు బయల్దేరగా శ్రీకృష్ణుడు నందుడితో ‘మనకి ఎన్నడూ సాయం చేయని ఇంద్రుణ్ణి పూజించే బదులు, మన జీవనాధారాలైన గోవులకు అనునిత్యం ఆహారాన్ని అందిస్తూ, అండగా నిలిచిన గోవర్ధన పర్వతాన్ని పూజించి కృతజ్ఞత చూపడం మేలు కదా’ అన్నాడు. అందరికీ అది సబబనిపించి గోవర్ధనగిరిని పూజించారు. దాంతో ఇంద్రుడు కోపించి ఉరుములు, పిడుగులతో భీకర వర్షం కురిపించాడు. ఆ ప్రళయం నుంచి తనవారిని కాపాడేందుకు గోవిందుడు గోవర్ధనగిరిని ఎత్తి, తన చిటికెనవేలిపై నిలిపాడు. గోకులమంతా దాని కింద చేరి రక్షణ పొందుతూ, పరమాత్మను కీర్తించసాగారు. బ్రహ్మదేవుని సూచన మేరకు ఇంద్రుడు క్షమాపణ కోరాడు. కృష్ణుడు మన్నించాడు. గోవర్ధనగిరి లీల ప్రదర్శించిన కార్తీక శుద్ధ పాడ్యమి నాడు అన్నకూటోత్సవం పేరుతో గోవర్ధనగిరిని పూజించడం ఆచారమైంది. ఆరోజు ఆవుపేడతో పర్వత ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని షోడశోపచారాలతో పూజించి, వివిధ వంటకాలను నివేదిస్తారు. పర్వతాలు, నదులు, వృక్షాలు సర్వం పూజనీయమే. వాటి అస్తిత్వాన్ని, పవిత్రతను కాపాడుకోవాలన్నదే ఇందులోని ఆంతర్యం.    

- జి.శ్రీనివాసు, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని