యోగః

విష్ణుసహస్రనామావళిలో ఇది 18 వది. ముక్తి సాధన మార్గం యోగం. ఆ సాధన వల్లనే పరమాత్మను పొందడం సాధ్యమవుతుందంటూ పరమాత్మను చేరే మార్గాన్ని సూచిస్తుంది ఈ నామం.

Updated : 14 Mar 2023 14:21 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 18 వది. ముక్తి సాధన మార్గం యోగం. ఆ సాధన వల్లనే పరమాత్మను పొందడం సాధ్యమవుతుందంటూ పరమాత్మను చేరే మార్గాన్ని సూచిస్తుంది ఈ నామం. సాధ్య, సాధనలు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. ముముక్షువుల పరమార్థమైన శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మానుభవం తెలిసి, వారిని అక్కడికి యోగం ద్వారా చేరుస్తాడు భగవానుడు. దీన్ని గ్రహించిన సాధకుడు ఇంద్రియ, మనోబుద్ధులను నిగ్రహించి, యోగయుక్తుడైన భగవానుడితో కలిసిపోవాలి- అనేది ఈ నామంలోని అంతరార్థం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని