మహాశివుడి పెళ్లి పిలుపు

శ్రీ-కాళ-హస్తులకు ముక్తిని ప్రసాదించిన దివ్యక్షేత్రంగా, భక్తుల పాలిట భూకైలాసంగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తిలో స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహిస్తారు.

Updated : 14 Mar 2023 13:19 IST

ఫిబ్రవరి 13-25 శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

శ్రీ-కాళ-హస్తులకు ముక్తిని ప్రసాదించిన దివ్యక్షేత్రంగా, భక్తుల పాలిట భూకైలాసంగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తిలో స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లు స్వయంగా తరలివెళ్లి గిరుల మీద కొలువైన పరివార దేవతా గణాలను, మునులను ఆహ్వానించడం, పెళ్లి వేడుక పూర్తయ్యాక

వీడ్కోలు పలకడం విశేషం. ఎటు చూసినా మామిడి తోరణాలు, రంగవల్లులతో కళకళలాడే ఈ ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.
స్థలపురాణాన్ని అనుసరించి సృష్టికర్త అయిన బ్రహ్మ చపల చిత్తంతో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం కైలాసంలోని ఈ పర్వతశ్రేణులను భువికి తీసుకొచ్చాడట. అందుకే ఈ గిరుల చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సమస్త దోషాలు, సర్వ పాపాలు హరించిపోతాయని విశ్వసిస్తారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 13న భక్తకన్నప్ప కొండపై కైలాసనాథస్వామి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ మవుతాయి. మర్నాటి నుంచి దేవరాత్రి, భూతరాత్రి, గాంధర్వ రాత్రి, నాగరాత్రి, మహాశివరాత్రి, లింగోద్భవం, బ్రహ్మరాత్రి, స్కంద రాత్రి, ఆనందరాత్రి, రుషిరాత్రి, దేవరాత్రి, పల్లకీరాత్రి, మోహరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

బ్రహ్మాండం రాజేష్ కుమార్, శ్రీకాళహస్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని