మనుః

విష్ణుసహస్రనామావళిలో ఇది 51 వది. ‘మనుః’ అంటే మననం చేసే మహిమాన్వితుడు అని అర్థం. సంకల్పం తోనే సమస్తాన్నీ సృష్టిస్తాడాయన. ఆయనకెప్పుడూ తాను చేసిన సృష్టి గుర్తుంటుంది.

Published : 08 Jun 2023 00:05 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 51 వది. ‘మనుః’ అంటే మననం చేసే మహిమాన్వితుడు అని అర్థం. సంకల్పం తోనే సమస్తాన్నీ సృష్టిస్తాడాయన. ఆయనకెప్పుడూ తాను చేసిన సృష్టి గుర్తుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూనే ఉంటాడు. ఇది సామాన్యార్థం. ఇక్కడ విశేషమేమంటే.. ‘దేవుడు మనం చేసినవన్నీ గుర్తుపెట్టు కుంటాడా ఏమిటి.. ఇష్టమొచ్చింది చేసేద్దాం. నచ్చినట్లుగా ప్రవర్తిద్దాం- అనుకుంటారు కొందరు. కానీ అది అమాయకత్వమే. జీవులు చేసే కర్మలను స్వామి గమనిస్తూనే ఉంటాడు. ఆయన చేసిన సృష్టిలోనే కదా జీవులు ఉన్నది. అందువల్ల ధర్మవిరుద్ధమైన పనులు చేస్తూ.. మనల్ని దేవుడేం పట్టించుకోడు, ఆయనకు గుర్తుండదు- అనుకోవద్దు. సృష్టిలోని అణువణువూ ఆయనకు సదా మననంలోనే ఉంటుందని హెచ్చరిస్తు న్నట్టు ఉంటుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని