జలంతో ఆశీర్వాదం!

కంబోడియాలో ‘జల దీవెన’కు ప్రాముఖ్యత ఉంది. దేశంలోని దాదాపు అన్ని పగోడాల్లో ఈ బౌద్ధ సంప్రదాయం కొనసాగుతుంది.

Published : 04 Jul 2024 00:10 IST

కంబోడియాలో ‘జల దీవెన’కు ప్రాముఖ్యత ఉంది. దేశంలోని దాదాపు అన్ని పగోడాల్లో ఈ బౌద్ధ సంప్రదాయం కొనసాగుతుంది. ఆశీర్వాదం కోరుకునే వ్యక్తులు పగోడా మెట్లమీద కూర్చుంటారు. బౌద్ధ సన్యాసి పవిత్రమైన మంత్రాలు పఠిస్తూ వాళ్ల నెత్తిమీద చల్లటి నీళ్లు కుమ్మరిస్తారు. ‘ఆరోగ్యం బాగుండాలి, శుభాలు ఒనగూరాలి, సంతోషాలు వెల్లివిరియాలి’- అంటూ దీవిస్తారు. ఆశీర్వాదం కోరి వచ్చేవారు- నీళ్లు ఎంత చల్లగా ఉన్నా, వస్త్రాలు తడిచిపోయి వణుకు పుట్టిస్తున్నా నిశ్శబ్దంగా ఉండిపోతారు. పైగా వాళ్ల ముఖాల్లో ప్రశాంతత, నిర్మలత్వం గోచరిస్తాయి. ఒకసారి ఒక కుటుంబం చొప్పున జల దీవెన అందుకుంటుంది. ఒక్కో జట్టుకు ఆరేడు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇది ఆధ్యాత్మికతను పెంచే ఆచారం కనుక పర్యటకులు ఇలాంటి దృశ్యాలను వాళ్ల అనుమతితో ఫొటోలు తీసుకుంటారు.

జల దీవెనకు ఫలానా రోజు అంటూ నియమం లేదు. పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా వ్యక్తులు తమ కుటుంబసభ్యులు లేదా మిత్రులతో కలిసి వెళ్లి దీవెన అందుకుంటారు. కొందరు ఒంటరిగానూ వెళ్తారు. అలాగే ఆసక్తి, నమ్మకం ఉన్న పర్యటకులు కూడా బౌద్ధ సన్యాసి వద్ద ఇలా ఆశీర్వాదం తీసుకుంటారు.

నాగరత్న 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని