బోనాల సంబురాలు
మన పండగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో వున్నవి కావడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. దక్షిణాయాన ప్రారంభ కాలంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ..
మన పండగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో ఉన్నవి కావడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. దక్షిణాయాన ప్రారంభ కాలంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. హైదరాబాద్ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. బోనమంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. అన్నమనేది సకల జీవులకు ఆహారం. అలాంటి ఆహారాన్ని అమ్మవారు మనకు ఇస్తుంటారు. అందుకు కృతజ్ఞతగా ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం.
ఆషాఢమాసంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతల ఆలయాలు నూతన శోభను సంతరించుకుంటాయి. గోల్కొండ కోటతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం, లాల్‌ధర్వాజా సింహవాసిని ఆలయం... తదితర ఆలయాల్లో జరిగే సంబరాలు అంబారాన్ని తాకుతాయి. ఘటోత్సవం అంటే కలశంలో అమ్మవారికి స్వాగతం పలకడం. పూర్ణకుంభంతో స్వాగతం పలకడాన్ని మనం చూస్తుంటాం. అమ్మవారికి కలశంతో స్వాగతం పలికితే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహారపదార్థాలు తయారుచేసి ఫలహారంబండిలో వేడుకగా ఆలయానికి తీసుకువెళుతారు. కొత్తకుండలో బియ్యం, పసుపు, బెల్లం, పాలు కలిపి ఆ కుండకు సున్నం పూసి వేపకొమ్మలు కట్టి తలపై పెట్టుకొని వూరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ వేడుకల్లో పోతురాజుల ప్రదర్శన విశేషంగా ఆకర్షిస్తుంది. బోనాల చివరి రోజుల్లో భవిష్యవాణి రంగం కార్యక్రమానికి విశేష ఆదరణ వుంటుంది. కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు వున్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ఏటా జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!