కృష్ణాష్టమి

దేవదేవుడు శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. ద్వాపరయుగంలో జన్మించిన పరంధాముడుఅనేక విధాలుగా విశ్వానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు....

Updated : 14 Mar 2023 12:54 IST

 ఆగస్టు 23

దేవదేవుడు శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. ద్వాపరయుగంలో జన్మించిన పరంధాముడుఅనేక విధాలుగా విశ్వానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు. మానవాళికి ఉపయుక్తమైన భగవద్గీతను అందించి గీతాచార్యునిగా ఖ్యాతిచెందారు. అందుకే ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుమ్‌ అంటారు

చెరసాలలో జన్మించి గోకులం, బృందావనంలో పెరిగిన బాలకృష్ణుడు అనేక రాక్షసులను సంహరించాడు. బాలప్రాయంలో శ్రీకృష్ణుని అల్లరి అందరికి ఆనందాన్ని పంచింది. భగవంతుడు భక్తికి దాసుడవుతాడు. అందుకనే అల్లరి చేస్తున్న శ్రీకృష్ణుడిని యశోద మాత తాడుతో చెట్లకు కట్టివేసింది. భగవంతుడిని ఎవరియినా కట్టగలారా? అన్న ప్రశ్నకు భక్తి తత్పరులు మాత్రమే చేయగలరు అన్న సమాధానం వస్తుంది. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ కోసం ధర్మం కోసం పోరాడిన పాండవులకు ఆ కరుణామూర్తి తన ఆశీస్సులను ఇచ్చాడు. ఎన్నో మాయలను ఎదుర్కొని వారిని సంరక్షించాడు. అదే పరమాత్ముని లీల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు