వినాయకచవితి

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత వుంది. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. ...

Updated : 12 Mar 2023 12:40 IST

సెప్టెంబరు 2

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత వుంది. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. గణనాధుని కృప వుంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయి. ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అనేకప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. ప్రతి ఇంటా వినాయకుడి బొమ్మను వివిధ రకాలైన పుష్పాలు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు.

గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముంబయి, పుణె, హైదరాబాద్‌... తదితర నగరాల్లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో వేలాదిగా విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలు జరుపుకొనే పండగల్లో వినాయకచవితిది అగ్రస్థానం. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మట్టితో వినాయక విగ్రహాల తయారీతో పాటు పర్యావరణ హితమైన రంగులను వాడటం పెరిగింది. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుకుంటున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు