తిరుమల బ్రహ్మోత్సవాలు
కలియుగ వైకుంఠం తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్నాయి. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా జరిపిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. మలయప్పస్వామివారు స్వయంగా భక్తులను ఆశీర్వదించేందుకు ఆలయం వెలుపలకి రావడం విశేషం. బ్రహ్మోత్సవాలకు ఎంతో చరిత్ర వుంది. వందల ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరుగుతుండటం విశేషం. స్వామివారి బ్రహ్మోత్సవాలను ...
తిరుమల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 30 - అక్టోబరు 8
కలియుగ వైకుంఠం తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 8 వరకు జరగనున్నాయి. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా జరిపిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. మలయప్పస్వామివారు స్వయంగా భక్తులను ఆశీర్వదించేందుకు ఆలయం వెలుపలకి రావడం విశేషం. బ్రహ్మోత్సవాలకు ఎంతో చరిత్ర వుంది. వందల ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వామి అనుంగు భక్తుడైన అన్నమయ్య ఈ విధంగా వర్ణించాడు.
‘‘ వీధుల వీధుల విభుడేగీ నిదె మోదము తోడుతో మ్రొక్కరో జనులు’’
తిరువీధుల విహరించే స్వామివారిని కనులారా చూచి నమస్కరించమని దీనర్థం. స్వామి ఉత్సవానికి ముందు సేనాని విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరించి కోట్లాది దేవతలను ఈ వేడుకకు ఆహ్వానిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తారు. స్వామి అనుంగువాహనమైన గరుత్మంతునిపై వూరేగే రోజున తిరుమల జన సముద్రాన్ని తలపిస్తుంది. ఈ ఉత్సవాల్లో ఒక రోజు రథోత్సవం, మరో రోజు స్వర్ణరథం వుంటుంది. చివరి రోజున చక్రస్నానంతో బ్రహ్మాండ ఉత్సవం ముగుస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu Arrest: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్
-
Pakistan: ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్
-
Chandrababu Arrest: మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డగించిన తెదేపా నేతలు
-
Chandrababu Arrest: రాజకీయ కక్షతో చంద్రబాబు అరెస్టు : బండి సంజయ్
-
Terror Attack: ఆ ఫోన్ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!