హోలీ పండుగ
హోలీ పర్వదినం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణగాథను తెలుసుకుందాం.రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు.
హోలీ పండుగ
![]()
హోలీ పర్వదినం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణగాథను తెలుసుకుందాం.రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టికునేవుండే ఆ పరమాత్ముడు మౌనంగా వుండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటలనుంచి బయటకువచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకో సందేహం రావచ్చు. హోలికకు వరముంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావముంటుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించకుండా పోయింది. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారు. చిన్ని కృష్ణుడు బాల్యంలో బృందావనం, గోకులంలో చేసిన కార్యాలను గుర్తు పెట్టుకునేందుకూ ఈ పర్వదినాన్ని రంగురంగులతో జరుపుకొంటారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మథుడిని పరమేశ్వరుడు భస్మం చేస్తాడు. అందుకనే హోలీ రోజే కామదహనం కూడా నిర్వహించడం సంప్రదాయం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్