శ్రీరామ నామ స్మరణంతో జగదానందం

భారత ఇతిహాస చరిత్రలో శ్రీరామచంద్రుడిది ప్రత్యేకస్థానం. ఒక పరిపూర్ణ మానవుడిగాసాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవతరించిన రూపమది.

Published : 07 Apr 2016 00:49 IST

శ్రీరామ నామ స్మరణంతో జగదానందం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : భారత ఇతిహాస చరిత్రలో శ్రీరామచంద్రుడిది ప్రత్యేకస్థానం. ఒక పరిపూర్ణ మానవుడిగాసాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవతరించిన రూపమది. పితృవ్యాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవతుడిగా, సకల గుణాభిరాముడిగా, కరుణాపయోనిధిగా, అగ్రజుడిగా, తండ్రిగా, ప్రజాపాలకుడిగా ... ఇలా ఏ రూపంలో చూసిన సకల గుణాలు శ్రీరామునిలో కనిపిస్తాయి.

చైత్ర మాసంలో నవమినాడు శ్రీరామనవమి పర్వదినం వస్తుంది.శ్రీమహావిష్ణువు దశావతరాల్లో త్రేతాయుగంలో శ్రీరాముని అవతారంలో దశరధ, కౌసల్యకు ప్రధమపుత్రుడిగా జన్మించాడు. చైత్రమాసమంటే లేలేత మామిడి కాయలు పండే కాలమది. వసంతరుతువులో చైత్ర మాసంలో నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రప్రభు భువిపై అడుగుపెట్టారు. మానవజీవితమంటే ఎలా వుండాలో ఆయన ఆచరణలో చూపించారు. విద్యార్థిగా, యువరాజుగా, తండ్రిమాటను ఆలకించి వనవాసానికి వెళ్లడం, వానరులతో స్నేహం, లంకా విజయం... తదితర ఘట్టాల్లో ఆయన ప్రదర్శించిన తీరు అనన్యం. ప్రాణసఖి సీత అన్వేషణలో కూడా ఎలాంటి ఆగ్రహానికి లోనుకాకుండా వుండటం ఆ నిండు వ్యక్తిత్వానికి నిదర్శనం. తనసేవలో అలరించిన ఆంజనేయునికి సముచితస్థానమివ్వడం ఆ కోవలోనిదే.

జగదానంద కారక..
రామ అంటే రమణీయం. జగదానందకారకుడు ఆయనే. ఆయన నామస్మరణలోనే మనకు ఆనందం లభిస్తుంది. ఒక నిండు మానవుడిగా ఎలావుండాలో ఆచరణలో చూపించాడు ఆ శ్రీరాముడు. ఆయన బాటలో నడిస్తే అంతా అలౌకిక ఆనందమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని