సంకటహర చతుర్థి

స‌క‌ల విఘ్నాల‌కు అధిప‌తి ఆదిదంప‌తుల కుమారుడైన వినాయ‌కుడు. ఆయ‌న‌ను పూజిస్తే అన్నిసంక‌టాలు తొల‌గిపోతాయి. అందుక‌నే ప్ర‌తిమాసంలో పౌర్ణ‌మి అనంత‌రం వ‌చ్చే చ‌తుర్థినాడు సంక‌ట‌హార చ‌తుర్థిని

Published : 24 Apr 2016 23:31 IST

సంకటహర చతుర్థి

ఫిబ్రవరి 14

స‌క‌ల విఘ్నాల‌కు అధిప‌తి ఆదిదంప‌తుల కుమారుడైన వినాయ‌కుడు. ఆయ‌న‌ను పూజిస్తే అన్నిసంక‌టాలు తొల‌గిపోతాయి. అందుక‌నే ప్ర‌తిమాసంలో పౌర్ణ‌మి అనంత‌రం వ‌చ్చే చ‌తుర్థినాడు  సంకటహర చతుర్థిని నిర్వ‌హిస్తాం. దీనినే సంక‌ష్ట‌హార చ‌తుర్థి అని కూడా అంటారు. చ‌వితికి అధప‌తి వినాయ‌కుడు. స్వామిని ఈ రోజున నిండుమ‌న‌సుతో కొలిస్తే అన్ని సంక‌టాలు తొల‌గిపోతాయ‌ని గ‌ణ‌ప‌తిపురాణం పేర్కొంటుంది. సాధార‌ణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉప‌వాస‌ముండాలి.సాయంత్రం చంద్ర‌ద‌ర్శ‌నం త‌రువాత విర‌మించాలి. స‌మీప గ‌ణ‌ప‌తి ఆల‌యంలో జ‌రిగే సంక‌ట‌హార‌చ‌తుర్థి వ్ర‌తంలోపాల్గొనాలి. వినాయ‌క‌చ‌వితిరోజున చంద్రున్ని చూడ‌కూడ‌దు. అయ‌తే సంక‌ట‌హార చ‌తుర్థి రోజున చంద్రున్ని చూడాలి. మంగ‌ళ‌వారంనాడు వ‌చ్చే సంక‌ట‌హార‌చ‌తుర్థిని అంగార‌క చ‌తుర్థి అంటారు. ఈ రోజున ఈ వ్ర‌తంనిర్వ‌హిస్తే మ‌రిన్ని మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు