శుక్ర మూఢమి

మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి...

Published : 28 Apr 2016 19:23 IST

శుక్ర మూఢమి

మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢమి సంభవిస్తుంది. సౌరకుటుంబానికి పెద్ద సూర్యుడు. ఆయన శక్తి అనంతంగా వుంటుంది. కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ వుంటుంది. ఈ క్రమంలో ఏదైనా గ్రహాలు ఆ సమీపానికి వెళ్లినప్పుడు అవి తమ శక్తిని కోల్పోతాయి. ఫలితంగా చీకటి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. ఏప్రిల్‌ 30 నుంచి జులై 13 వరకు శుక్రమూఢమి వుంటుంది. గురు,శుక్ర గ్రహాలు శుభకార్యాలకు మంచివి. అయితే ఆ గ్రహాలకు మూఢమి సమయంలో శక్తి వుండదు. అందుకనే శుభకార్యాలను వాయిదావేస్తుంటారు. దుర్ముఖి నామసంవత్సరంలో చైత్రంలో కొన్ని రోజులు వైశాఖం, జ్యేష్ట మాసాల్లో దీని ప్రభావం వుంటుంది. అయితే తప్పనిసరిగా చేయాలకున్న పనులను మాత్రం దైవస్మరణతో ప్రారంభించవచ్చు. ఏప్రిల్‌ 30 నుంచి మౌఢమి ప్రారంభమవుతుంది. ముందుజాగ్రత్తగా ఏప్రిల్‌ 29 నుంచే పనులను ప్రారంభిస్తే ఆ దోషమంటదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు