మృగ‌శిర‌ కార్తె

మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రిజ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది....

Published : 02 Jun 2016 09:45 IST

మృగ‌శిర‌ కార్తె

జూన్‌ 8

మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రిజ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ న‌క్ష‌త్రంలో ప్ర‌వేశిస్తే ఆ రాశి ప్రారంభ‌మ‌వుతుంది. జింక త‌ల క‌లిగివుండ‌టంతో ఈ కార్తెను మృగశిర‌కార్తెగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ కార్తె మ‌న‌దేశంపై విశేష‌ప్ర‌భావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువ‌ప‌నాలు భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తాయి. అప్ప‌టివ‌ర‌కు నిప్పులు చెల‌రేగిన భానుడి కిర‌ణాలు న‌ల్ల‌టి మేఘాల ప్ర‌భావంతో చ‌ల్ల‌బ‌డుతాయి. దేశానికి జీవ‌ధార అయిన వ‌ర్షాల‌తో నేల‌త‌ల్లి పుల‌క‌రిస్తుంది. రైతులు తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే  దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధ‌మ‌వుతారు. ఏరువాక‌సాగే కాలం అని కూడా అంటారు. ఈ న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. అధిప‌తి కుజుడు. రాశి అధిప‌తులు శుక్రుడు, బుధుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు