దశ పాపహార దశమి

జ్యేష్ఠ మాసంలో దశమి రోజును దశ పాపహార దశమిగా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన పరమపావనమైన గంగానదిలో...

Published : 08 Jun 2016 23:19 IST

దశ పాపహార దశమి
జూన్‌ 22

జ్యేష్ఠ మాసంలో దశమి రోజును దశ పాపహార దశమిగా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన పరమపావనమైన గంగానదిలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజచేస్తే పది పాపాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సమస్త జీవజాలానికి ప్రాణం నీరు. నీరు లేనిదే జీవం లేదు. సగర కుమారులకు సద్గతులు ప్రాప్తించేందుకు భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగానది భువిపైకి అడుగిడింది. అందుకనే మనం గంగానదిని పరమపావనమైనదిగా పరిగణిస్తాం. ఈ రోజున గంగలో స్నానం చేయలేని వారు ఇతర నదుల్లో స్నానమాచరించి గంగను పూజించవచ్చు. పరుషంగా మాట్లాడటం, ఇతర ప్రాణులను హింసించ‌టం, అసత్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, పరుల ధనాన్ని ఆశించడం, గర్వాన్ని కలిగివుండటం... తదితర పాపాలను ఈ పర్వదినం పొగొడుతుంది. అందుకనే దశ పాపహార దశమిగా పిలుస్తారు. మానవ జీవితంలో అనేక సవాళ్లు వుంటాయి. ఈర్ష్య‌, అసూయ‌లు కలుగుతాయి. వీటిని అధిగమించినప్పుడే పరిపూర్ణ జీవితం సార్థకమవుతుంది. దైవంపై నమ్మకంతో పూజ‌లు చేయ‌డం ద్వారా వీటి నుంచి మానవుడు విముక్తి పొందుతాడని ఈ పుణ్యదినం అంతర్లీనంగా సందేశమిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని