నిర్జల ఏకాదశి

జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పేర్కొంటారు. అన్ని ఏకాదశుల్లో కెల్లా ఈ ఏకాదశికి కఠినమైన ఉపవాసం ఆచరించాలని పెద్దలు చెబుతారు. ఏకాదశికి ఉపావాసం వుండటం తెలిసిందే. అయితే...

Published : 15 Jun 2016 22:18 IST


                             నిర్జల ఏకాదశి

జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పేర్కొంటారు. అన్ని ఏకాదశుల్లో కెల్లా  ఈ ఏకాదశికి కఠినమైన ఉపవాసం ఆచరించాలని పెద్దలు చెబుతారు. ఏకాదశికి ఉపావాసం వుండటం తెలిసిందే. అయితే ఘనపదార్థాలు భుజించకుండా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాం. దీనికి భిన్నంగా
నిర్జల ఏకాదశిని కనీసం నీరు కూడా సేవించకుండా వుండటంతో కఠినమైన ఉపవాసంగా పేరువచ్చింది. దీన్ని పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతంలో పాండవుల్లోని భీముడు అతిబలవంతుడు. అతను భోజనప్రియుడు. ప్రతిఏకాదశికి మిగిలిన పాండవులు ఉపవాసాన్ని
ఆచరిస్తుంటే అతను చేయలేకపోయేవాడు. తాను ఏకాదశి ఉపవాసం చేయలేకపోవడంపై మధనపడేవాడు. ఒకనాడు వేదవ్యాసుడిని దీనికి పరిష్కారం చూపించమని కోరుతాడు. దీంతో నిర్జల ఏకాదశి రోజు కనీసం జలం కూడా సేవించకుండా వుంటే సరిపోతుందని ఆ దీక్షే సంవత్సరంలోని అన్ని
ఏకాదశి దీక్షలకు సమానమని వ్యాసమహర్షి వెల్లడిస్తాడు. ఈ దీక్షను ఆచరించడంతో భీముని ఆశయం నెరవేరినట్టయింది. అందుకనే నిర్జల ఏకాదశిని అంత పవిత్రమైనదిగా చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని