ఏరువాక పున్నమి

భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయికదేశం. వ్యవసాయం ద్వారానే పంటలు వస్తాయి. పంటల ద్వారా ఆహారధాన్యాలు లభిస్తాయి. ఆహారం లేకుంటే మానవ మనుగడ వుండదు. కోట్లాదిమంది ఆకలి బాధలు తీరాలంటే వ్యవసాయ రంగం దిగుబడులు పెరగాలి. భారతదేశంలో రుతుపవనాలు వర్షాలను తీసుకువస్తాయి. అంతకు ముందు వరకు ఎండవేడిమితో వేడెక్కిన పుడమి వర్షాలతో చల్లబడుతుంది. ....

Published : 18 Jun 2016 19:29 IST

ఏరువాక పున్నమి
జూన్‌ 20

భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయికదేశం. వ్యవసాయం ద్వారానే పంటలు వస్తాయి. పంటల ద్వారా ఆహారధాన్యాలు లభిస్తాయి. ఆహారం లేకుంటే మానవ మనుగడ వుండదు. కోట్లాదిమంది ఆకలి బాధలు తీరాలంటే వ్యవసాయ రంగం దిగుబడులు పెరగాలి. భారతదేశంలో రుతుపవనాలు వర్షాలను తీసుకువస్తాయి. అంతకు ముందు వరకు ఎండవేడిమితో వేడెక్కిన పుడమి వర్షాలతో చల్లబడుతుంది. తొలకరి వర్షాలు కురవడంతో రైతులు ఎద్దులను పొలాలకు తీసుకువెళ్లి నాగళ్లకు కట్టి పొలాలను దున్నుతారు. వర్ష రుతు ప్రారంభంలో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని అర్థం. ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమని తెలుస్తోంది. వేల సంవత్సరాల నుంచి ఏరువాక పున్నమిని పండుగలా కర్షకులు నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుంటూ పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. ఎద్దులను పశువుల్లాగా కాకుండా వాటికి పూజలు చేసి వ్యవసాయంలో ఒక భాగంగా కర్షకులు భావిస్తారు. అందుకనే వాటికి వ్యవసాయంలో సముచిత ప్రాధాన్యం కల్పించారు. విష్ణుపురాణంలో సీతాయజ్ఞం అనే మాట వినవస్తుంది. దీనికి అర్థం నాగేటి చాలు అని తెలుస్తోంది. హాలుని గాథాసప్తశతిలో ఏరువాకపున్నమి గురించి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు