ఆషాఢ మాసం

ఆషాఢమాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే....

Published : 02 Jul 2016 21:58 IST

ఆషాఢ మాసం

ఆషాఢమాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తారు. లక్షలాదిమంది పాల్గొనే ఈ యాత్ర ఎంతో విశిష్టం, పవిత్రం. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తాయి. తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. పంచమవేదంగా ఖ్యాతికెక్కిన మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని పూజించే రోజును గురుపౌర్ణమిగా నిర్వహిస్తాం. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు