గోదావరి అంత్య పుష్కరాలు

పుష్కరాలు వచ్చిన నదికి సంవత్సర కాలం తరువాత చివరలో అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. గత ఏడాది గోదావరి నదికి పుష్కరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి 12 రోజులు పుష్కరుడు ఒక...

Published : 25 Jul 2016 22:01 IST

గోదావరి అంత్య పుష్కరాలు
జులై 31 నుంచి

పుష్కరాలు వచ్చిన నదికి సంవత్సర కాలం తరువాత చివరలో అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. గత ఏడాది గోదావరి నదికి పుష్కరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి 12 రోజులు పుష్కరుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో అంత్యపుష్కరాలు వుంటాయి. గోదావరి నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరాల ప్రారంభసమయం, ముగింపు రెండూ కూడా ప్రత్యేకమైనవి. ఈ రెండు సమయాల్లో ఎప్పుడూ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసినా పుణ్యం లభిస్తుంది. అంత్యపుష్కరాల్లో ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించాలి. ఈ సమయంలో సకల దేవతలు నదిలో స్నానమాచరిస్తారని ధార్మికగ్రంథాలు తెలుపుతున్నాయి. ఆది పుష్కరాలు ఎంత పవిత్రమైనవో అంత్యపుష్కరాలు కూడా అంతే పవిత్రమైనవి. వివిధ కారణాలతో ఆది పుష్కరాలకు వెళ్లలేని వారు అంత్యపుష్కరాలకు వెళ్లవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు