శ్రావణ పౌర్ణమి

శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణమాసం అంటారు. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆకాశం ....

Published : 12 Aug 2016 22:27 IST

శ్రావణ పౌర్ణమి

శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణమాసం అంటారు. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆకాశం మబ్బులతో వెండికొండలను తలపిస్తుంటుంది. పూర్వకాలం వేద అధ్యయనం శ్రావణమాసంలోనే ప్రారంభమయ్యేది. ఈ పౌర్ణమినే రక్షా పౌర్ణమి, జంధ్యాల‌ పున్నమి, రాఖీ పూర్ణిమ, నూలు పున్నమి, నారికేళ పున్నమిగా వ్యవహరిస్తారు. సోదరులకు సోదరీమణులు ఆప్యాయతతో కట్టే రక్షాబంధన్‌ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తోంది.

భవిష్యత్‌పురాణంలో రక్షాబంధన్‌ గురించి వివరించారు. విష్ణుమూర్తి దేవతల కోరిక మేరకు  బలి చక్రవర్తిని బంధిస్తాడు. అయితే ఈ ర‌క్షాబంధ‌నం అతనికి రక్షణగా నిలుస్తుందని వరమిచ్చినట్టు తెలుస్తోంది. పాల్కురికి సోమనాథుడు ఈ పౌర్ణమిని నూలి పున్నమిగా అభివర్ణించాడు. నూలుతో వడికిన జంధ్యాల‌ను ఈ రోజు ధరించడం ప్రత్యేకత. కర్ణాటకలో నారికేళ పున్నమిగా పండగ నిర్వహిస్తారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండగ అద్దం పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని