వామన జయంతి

శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామనావతారం. భాద్రపద శుక్లపక్షంలో ద్వాదశి రోజున వైకుంఠనాథుడు ఆదితి గర్భాన వామనుడిగా జన్మించాడు. ఈ అవతారం విశిష్టతను గురించి విష్ణుపురాణంలో వివరించారు. రాక్షసరాజైన బలి చక్రవర్తి దేవతలతో యుద్దంలో పరాజయం పాలవుతాడు. అనంతరం గురువు శుక్రాచార్యుని సూచనలతో యజ్ఞాలు చేసి అనేక విజయాలు సాధిస్తాడు. అనంతరం మరింత శక్తిని సంపాదించాలన్న తలంపుతో యాగాలను నిర్వహిస్తాడు. ..

Published : 06 Sep 2016 19:10 IST

వామన జయంతి

శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామనావతారం. భాద్రపద శుక్లపక్షంలో ద్వాదశి రోజున వైకుంఠనాథుడు ఆదితి గర్భాన వామనుడిగా జన్మించాడు. ఈ అవతారం విశిష్టతను గురించి విష్ణుపురాణంలో వివరించారు. రాక్షసరాజైన బలి చక్రవర్తి దేవతలతో యుద్దంలో పరాజయం పాలవుతాడు. అనంతరం గురువు శుక్రాచార్యుని సూచనలతో యజ్ఞాలు చేసి అనేక విజయాలు సాధిస్తాడు. అనంతరం మరింత శక్తిని సంపాదించాలన్న తలంపుతో యాగాలను నిర్వహిస్తాడు. దీన్ని గమనించిన దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటాడు. మరో వైపు బలి చక్రవర్తి యజ్ఞాలు పూర్తవుతున్నాయి. వందో యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆదితికి తనయుడిగా జన్మించిన మహావిష్ణువు బ్రాహ్మణ బాలుడిగా యజ్ఞప్రదేశానికి వెళుతాడు. సూర్యభగవానుడిచ్చిన గొడుగు, కుబేరుడు ప్రసాదించిన భిక్షపాత్రతో యజ్ఞప్రాంగణంలోకి అడుగుపెట్టిన వామనమూర్తి తేజస్సుకు బలిచక్రవర్తి ఆశ్చర్యం చెందుతాడు. దానాల్లో భాగంగా ఏం కావాలో కోరుకోమనగా తనకు కేవలం మూడు అడుగులు చాలని బలిచక్రవర్తిని ఆయన కోరుతాడు. దీనికి అంగీకరించిన బలి అతనికి మూడుఅడుగులను దానంగా ఇస్తాడు. దీంతో వామనుడు తన ఆకారాన్ని పెంచి ఒక్క అడుగు భూమిని, మరో అడుగు ఆకాశంపై పెడుతాడు. మూడు అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడగ్గా స్వామి విరాట్‌ స్వరూపాన్ని వీక్షించి అతను ఆనందభరితుడై మూడో అడుగును తన తలపై పెట్టమని సూచిస్తాడు. దీంతో మూడో అడుగును బలిచక్రవర్తిపై పెట్టిన త్రివిక్రముడు అతన్ని పాతాళానికి పంపించివేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని