ఉండ్రాళ్ల తద్దె

లోకమాత, జగజ్జనని పార్వతీదేవి స్వయంగా ఆచరించిన వ్రతమిది. పరమేశ్వరున్ని తన పతిగా పొందాలని తపస్సు ఆచరించింది. భాద్రపద మాసం బహుళ తదియనాడు స్వామి ఆమెను అనుగ్రహించి సతీమణిగా స్వీకరించాడు. మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఆమె వరమిచ్చింది. అందుకనే ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి....

Published : 14 Sep 2016 18:41 IST

ఉండ్రాళ్ల తద్దె
సెప్టెంబరు 27

లోకమాత, జగజ్జనని పార్వతీదేవి స్వయంగా ఆచరించిన వ్రతమిది. పరమేశ్వరున్ని తన పతిగా పొందాలని తపస్సు ఆచరించింది. భాద్రపద మాసం బహుళ తదియనాడు స్వామి ఆమెను అనుగ్రహించి సతీమణిగా స్వీకరించాడు. మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఆమె వరమిచ్చింది. అందుకనే ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి.

రెండు రోజుల పాటు ఈ నోమును జరుపుకోవాల్సివుంటుంది. తదియ ముందు విదియ రోజున విఘ్నేశ్వరున్ని ఆరాధించి కుడుములతో నైవేధ్యం ఇవ్వాలి. ఆ సాయంత్రం రోజున ముత్తయిదవులను తదియ నాడు జరిగే వ్రతానికి ఆహ్వానిస్తారు. తదియ రోజున వేకువ జామునే స్నానం చేసి ఆటలాడుతారు. అనంతరం మధ్యాహ్నం అమ్మవారి పూజలో భాగంగా ఉత్తరేణి మొక్కకు నమస్కరిస్తారు. ఉమాదేవికి 16 ఉండ్రాళ్లను సమర్పిస్తారు. పంచ ముత్తయిదువులకు చీర, ఉండ్రాళ్లు, తాంబులాలను వాయినంగా ఇస్తారు.

పరమేశ్వరుడే స్వయంగా ఈ వ్రతవిధానాన్ని పార్వతీమాతకు వివరించినట్టు పురాణగ్రంథాలు తెలుపుతున్నాయి. ఉండ్రాళ్ల తద్దెను పదహారు కుడుముల నోము, షోడశోమావ్రతంగా కూడా పిలుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని