కార్తీక పూర్ణిమ
శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం. క్షీరసాగర మధన సమయంలో వెలువడిన హాలహలాన్ని పరమేశ్వరుడు సేవించి .....
కార్తీక పూర్ణిమ
నవంబర్ 4
శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం. క్షీరసాగర మధన సమయంలో వెలువడిన హాలహలాన్ని పరమేశ్వరుడు సేవించి తన గొంతులో వుంచుకున్నాడు. అయితే ఆ విష ప్రభావానికి శివుడు అస్వస్థతకు గురయ్యాడు. అగ్ని స్వభావం గలిగిన ఆ విషం నుంచి మహేశ్వరుడిని కాపాడమని అమ్మవారు అగ్నిదేవున్ని ప్రార్థించింది. అనేక సపర్యల అనంతరం శివుడు కోలుకున్నాడు. అగ్నిస్వభావం వున్న కృతికానక్షత్రానికి పార్వతీదేవి కృతజ్ఞతగా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటుచేసింది. అందుకనే ఈ పౌర్ణమిని అత్యంత విశిష్టమైనదిగా పేర్కొంటారు. ఈ రోజున మహిళలు పగలంతా ఉపవాస దీక్షలో వుండి రాత్రి దీపారాధన చేయాలి. ఇంటి ముందు వాకిట్లలో, పుణ్యతీర్థాల్లో, దేవాలయప్రాంగణాల్లో , నదీతీరాల్లో, పుష్కరిణుల్లో దీపాలను వెలిగిస్తారు.ఇదో అద్భుతఘట్టం. కార్తీక మాసం ఆధ్యాత్మికపరంగా విశిష్టమైన నెల. ఈ మాసంలో అత్యంత పవిత్రమైనది కార్తీకపౌర్ణమి కావడంతో భగవంతుని కృపకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రోజున తమ శక్తికొలది దానాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మార్కండేయ పురాణగ్రంథం దానం చేస్తే మంచిదని ధర్మగ్రంథాలు పేర్కొంటున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్