మౌని అమవాస్య
మౌన అమవాస్యను ఉత్తరభారతంలో మౌని అమవాస్యగా పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే అమవాస్య సందర్భంగా నదీస్నానం
మౌని అమవాస్య
జనవరి 27
మౌన అమవాస్యను ఉత్తరభారతంలో మౌని అమవాస్యగా పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే అమవాస్య సందర్భంగా నదీస్నానం ఉత్తమమని పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున మౌనదీక్ష వహించడంతోపాటు పొద్దునే నిద్ర లేచి ఉదయం వేళలో గంగస్నానం చేయాలి. అనంతరం దగ్గరలోని పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి. సన్యాసి దీక్షలో ఉన్నవారికి మౌనం ఒక సాధనం. సాధువులకు మౌనం ఒక సాధనమని శంకరభగవత్పాదులు చెప్పారు. ఆధ్యాత్మిక దీక్షకు మౌనదీక్ష అవసరమని రమణ మహర్షి అన్నారు. ఆరోగ్యపరంగా పరిశీలిస్తే మౌనం మంచిది. నిరంతరం మనం అనేక మాటలు మాట్లాడుతుంటాం. కనీసం ఒక్కరోజు మాట్లాడకపోయినా స్వరపేటికకు విశ్రాంతి కలుగుతుంది. మౌని అమవాస్య రోజున గంగానదీ అమృతంగా మారుతుందని ఆ సమయంలో పుణ్యస్నానాలు చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. త్రివేణి సంగమమైన అలహాబాద్ ప్రయాగ ఈ పర్వదిన సందర్భంగా భక్తుల తరంగమవుతుంది. ఎముకలు కొరికే చలిలో సైతం లక్షలాదిమంది భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ప్రత్యేకించి కుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమవాస్య గంగా తీరంలో అశేష జనవాహని తరలివస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్